MLC Dasoju Sravan | నిరుద్యోగుల మొర వినండి.. బేషజాలకు పోకుండా పరీక్షల తేదీలు మార్చండి
MLC Dasoju Sravan | టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న నిరుద్యోగుల మొరను దయచేసి వినాలని.. బేషజాలకు పోకుండా పరీక్షల తేదీలు మార్చాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కోరారు.
- యువత ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతారు
- ఒక అవకాశం కోసం మరో అవకాశాన్ని వదులుకునే దుస్థితి తేవద్దు
- రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విజ్ఞప్తి
Dasoju Sravan | త్రినేత్ర న్యూస్: టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న నిరుద్యోగుల మొరను దయచేసి వినాలని.. బేషజాలకు పోకుండా పరీక్షల తేదీలు మార్చాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కోరారు. వారు ఏళ్ల తరబడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారని.. ఒక అవకాశం కోసం మరో అవకాశాన్ని వదులుకునే దుస్థితి తేవొద్దన్నారు. ఒకే సమయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పరీక్షలు రావడం వల్ల విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. టీజీపీఎస్సీ అధికారుల సమన్వయ లోపం, సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల వేలాది మంది ఇంజినీరింగ్ అభ్యర్థుల భవిష్యత్తు అయోమయంలో పడిందన్నారు. ఈమేరకు శనివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
అక్టోబర్ 26న TGPSC PCB AEE (నోటిఫికేషన్ 02/OG/PC/2026) & AAI మేనేజర్ (సివిల్ - Advt 12/2026) పరీక్షలు ఒకే రోజున షెడ్యూల్ అయ్యాయి. అక్టోబర్ 27-28 తేదీల్లో వెనువెంటనే RRB JE CBT-1 (CEN 04/2026) పరీక్షలు ప్రారంభం కానుండటంతో ప్రయాణంతో పాటు ప్రిపరేషన్లో అభ్యర్థులకు తీవ్ర భారంగా మారింది. నవంబర్ 6, 7 తేదీల్లో TGPSC AEE (R&B) పరీక్షలు, అదే సమయంలో సెంట్రల్ లెవల్ SSC JE పరీక్షలు ఉండటం వల్ల సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు మరో ఎదురుదెబ్బ తగలనుంది.
పరీక్షా క్యాలెండర్ ఖరారు చేసేటప్పుడు ఇతర జాతీయ స్థాయి పరీక్షల తేదీలను పరిగణనలోకి తీసుకొని ముందుచూపుతో వ్యవహరించాలి. ఏళ్ల తరబడి శ్రమించి సిద్ధమైన యువత.. ఒక అవకాశం కోసం మరో అవకాశాన్ని వదులుకునే దుస్థితి తేవద్దు. తెలంగాణ నిరుద్యోగ ఇంజినీరింగ్ అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, బేషజాలకు పోకుండా.. క్లాష్ అవుతున్న TGPSC PCB-AEE, R&B-AEE పరీక్షలను వెంటనే రీషెడ్యూల్ చేయాలి. తగిన వ్యవధితో కొత్త తేదీలను ప్రకటించాలి అని దాసోజు విజ్ఞప్తి చేశారు.
ఇప్పుడు టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న నిరుద్యోగులు.. దయచేసి వారి మొరను ఆలకించండి.. @TelanganaCMO
@revanth_anumula#TGPSC అధికారుల సమన్వయ లోపం, సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల వేలాది మంది ఇంజనీరింగ్ అభ్యర్థుల భవిష్యత్తు అయోమయంలో పడింది!
ఒకే సమయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పరీక్షలు రావడం వల్ల విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు:
📌 అక్టోబర్ 26: TGPSC PCB AEE (నోటిఫికేషన్ 02/OG/PC/2026) & AAI మేనేజర్ (సివిల్ - Advt 12/2026) పరీక్షలు ఒకే రోజున షెడ్యూల్ అయ్యాయి.
📌 అక్టోబర్ 27–28: వెనువెంటనే RRB JE CBT-1 (CEN 04/2026) పరీక్షలు ప్రారంభం కానుండటంతో ప్రయాణం, ప్రిపరేషన్ అభ్యర్థులకు తీవ్ర భారంగా మారింది.
📌 నవంబర్ 6 & 7: TGPSC AEE (R&B) పరీక్షలు, అదే సమయంలో సెంట్రల్ లెవల్ SSC JE పరీక్షలు ఉండటం వల్ల సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు మరో తీవ్ర ఎదురుదెబ్బ తగలనుంది.🔥పరీక్షా క్యాలెండర్ ఖరారు చేసేటప్పుడు ఇతర జాతీయ స్థాయి పరీక్షల తేదీలను పరిగణనలోకి తీసుకొని ముందుచూపుతో వ్యవహరించాలి.
🔥ఏళ్ల తరబడి శ్రమించి సిద్ధమైన యువత.. ఒక అవకాశం కోసం మరో అవకాశాన్ని వదులుకునే దుస్థితి తేవద్దు!
🔥తెలంగాణ నిరుద్యోగ ఇంజనీరింగ్ అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, బేషజాలకు పోకుండా క్లాష్ అవుతున్న TGPSC PCB-AEE మరియు R&B-AEE పరీక్షలను వెంటనే రీషెడ్యూల్ చేసి, తగిన వ్యవధితో కొత్త తేదీలను ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం!
@revanth_anumula @TelanganaCS @Bhatti_Mallu @KomatireddyKVR @BVenkateshamIAS @AspirantsTspsc
#TGPSC #TelanganaPolitics— Prof Dasoju Sravan Kumar (@sravandasoju) October 17, 2026
సంబంధిత వార్తలు

Chamala Kirankumar Reddy | భూమంతా ఎల్‌నినో ఉంటే.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు మాత్రం లేదు
అక్టోబర్ 17, 2026

Ponnam Prabhakar | రోడ్డు ప్రమాదాల నివారణే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
అక్టోబర్ 17, 2026

TGSRTC | భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త.. అమ్మవారి ఆలయాలకు ప్రత్యేక బస్సులు!
అక్టోబర్ 16, 2026
తాజావార్తలు
- ●Music Director Deva | దిగ్గజ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత - నాలుగు వందల సినిమాలకు స్వరకర్తగా...
- ●Windows 11 | 8 జీబీ ర్యామ్ పీసీ యూజర్లకు గుడ్‌న్యూస్.. విండోస్ 11 వేగం 20 శాతం పెంపు..
- ●Chamala Kirankumar Reddy | భూమంతా ఎల్‌నినో ఉంటే.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు మాత్రం లేదు
- ●Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
- ●Zero Sugar Diversion Ethanol | ఇథనాల్ తయారీలో చక్కెరపై నిషేధం.. కేంద్రం సంచలన నిర్ణయం!
- ●E2E Networks | ఏడాదిలో 250 శాతం లాభం.. ఇన్వెస్టర్లకు కాసుల పంట ఇచ్చిన షేర్..

Music Director Deva | దిగ్గజ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత - నాలుగు వందల సినిమాలకు స్వరకర్తగా...

Windows 11 | 8 జీబీ ర్యామ్ పీసీ యూజర్లకు గుడ్‌న్యూస్.. విండోస్ 11 వేగం 20 శాతం పెంపు..

Chamala Kirankumar Reddy | భూమంతా ఎల్‌నినో ఉంటే.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు మాత్రం లేదు

Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు



