త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heat Wave | తెలంగాణ‌లో దంచికొట్ట‌నున్న ఎండ‌లు..! 40 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు..!!

Heat Wave | నిన్న‌టి వ‌ర‌కు తెలంగాణ వ్యాప్తంగా మేఘావృత‌మైన వాతావ‌ర‌ణం క‌నిపించింది. ప‌లు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిశాయి. చాలా చోట్ల వ‌డ‌గ‌ళ్ల వాన కురిసింది. మొత్తంగా ఈ అకాల వ‌ర్షాల‌తో రాష్ట్రంలో చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఇక గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎండ‌లు దంచికొట్ట‌నున్న‌ట్లు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది.

S

Telangana | Published On Mar 26, 2026, 3.21 pm IST

Heat Wave | తెలంగాణ‌లో దంచికొట్ట‌నున్న ఎండ‌లు..! 40 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు..!!
Advertisement

Heat Wave | త్రినేత్ర‌.న్యూస్ : నిన్న‌టి వ‌ర‌కు తెలంగాణ వ్యాప్తంగా మేఘావృత‌మైన వాతావ‌ర‌ణం క‌నిపించింది. ప‌లు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిశాయి. చాలా చోట్ల వ‌డ‌గ‌ళ్ల వాన కురిసింది. మొత్తంగా ఈ అకాల వ‌ర్షాల‌తో రాష్ట్రంలో చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఇక గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎండ‌లు దంచికొట్ట‌నున్న‌ట్లు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ప‌గ‌టి ఉష్ణోగ్ర‌లు 40 డిగ్రీల‌కు పైగా న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. రాత్రి వేళ మాత్రం అక్క‌డ‌క్క‌డ ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌డ‌గ‌ళ్ల వాన కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది.

ఆదిలాబాద్, జోగులాంబ గ‌ద్వాల‌, కుమ్రం భీం ఆసిఫాబాద్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, మంచిర్యాల‌, నాగ‌ర్‌క‌ర్నూల్, నారాయ‌ణ‌పేట‌, నిర్మ‌ల్, వ‌న‌ప‌ర్తి జిల్లాల్లో 40 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

ఈ నెల చివ‌ర‌లో 40 నుంచి 50 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో ప‌లు జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది వాతావ‌ర‌ణ శాఖ‌. ఆదిలాబాద్, కొత్త‌గూడెం, హ‌నుమ‌కొండ‌, జ‌గిత్యాల‌, హైద‌రాబాద్, జ‌న‌గామ‌, భూపాల‌ప‌ల్లి, గ‌ద్వాల‌, కామారెడ్డి, క‌రీంన‌గ‌ర్, ఖ‌మ్మం, ఆసిఫాబాద్, మ‌హ‌బూబాబాద్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, మంచిర్యాల‌, మెద‌క్, మ‌ల్కాజ్‌గిరి, ములుగు, నాగ‌ర్‌క‌ర్నూల్, న‌ల్ల‌గొండ‌, నారాయ‌ణ‌పేట‌, నిర్మ‌ల్, నిజామాబాద్, పెద్ద‌ప‌ల్లి, రాజ‌న్న సిరిసిల్ల‌, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట‌, సూర్యాపేట‌, వికారాబాద్, వ‌న‌ప‌ర్తి, వ‌రంగ‌ల్, యాదాద్రి జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసిన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది.

Advertisement

తాజావార్తలు

Advertisement