Harish Rao | ‘హరీశ్ అన్న ఉద్యోగ యాప్’.. యువత జీవితానికి గేమ్ చేంజర్
Harish Rao | సిద్దిపేట యువతకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారికి ఉద్యోగ కల్పన అందించాలనే లక్ష్యంతో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ముందుకు వెళ్తున్నారు.
అతిపెద్ద ఎడ్యుకేషనల్ హబ్‌గా సిద్దిపేట
యువత నలుగురికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి..
సోషల్ మీడియాకు బానిస కావొద్దు..
కష్టపడి చదివితేనే జీవితాంతం సుఖపడుతారు..
పట్టుదల ఉంటే పేదరికం అడ్డుకాదు..
మీ జీవితాలకు ఈ యాప్ గేమ్ చేంజర్
మాజీ మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : సిద్దిపేట యువతకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారికి ఉద్యోగ కల్పన అందించాలనే లక్ష్యంతో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే సిద్దిపేట యువతకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందించే లక్ష్యంతో హరీశ్ అన్న ఉద్యోగ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ వెళ్లి వేల రూపాయాలు ఖర్చుపెట్టే బదులు.. ఈ ఉచిత యాప్‌ను వాడుకుంటే మీ జీవితాలకు ఇదే గేమ్ చేంజర్ అవుతుందని యాప్ ప్రారంభం సందర్భంగా హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
ఏ యాప్ వెతికిన కూడా ముందు ఫ్రీ అంటారు తర్వాత 500 కట్టమంటారని విద్యార్థులు చెప్పారు. ఈ ఉద్యోగ యాప్‌ను మేము సీరియస్‌గా యూస్ చేసుకొని ఆత్మవిశ్వాసం పొందుతామని విద్యార్థులు చెప్పిన మాటలు మంచి సంతోషాన్ని కలిగించాయి. ఏ పని చేసినా దాంట్లో మంచి ఫలితాలు వచ్చినప్పుడే సంతృప్తి కలుగుతుంది. ఈ యాప్ ప్రారంభానికి వేదికైన ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చరిత్ర ఉంది. ఇక్కడ కేసీఆర్ చదువుకున్నారు. ఒక రాష్ట్రాన్ని సాధించిన నాయకున్ని అందించిన కాలేజ్. ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అందించిన కాలేజ్ ఇది. నాక్‌లో సిద్దిపేట డిగ్రీ కాలేజీకి ఏ గ్రేడ్ రావడానికి సిబ్బంది, ప్రిన్సిపల్ చాలా కృషి చేశారు. ఈ కాలేజీ అభివృద్ధికి నందిని సిద్ధారెడ్డి, చుక్కా రామయ్య లాంటి వారు పని చేశారు. సిద్దిపేట డిగ్రీ కాలేజీకి తనకున్న అనుబంధాన్ని ఈమధ్య చుక్కారామయ్యని కలిసినప్పుడు గుర్తు చేశారని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సిద్దిపేట ఒక ఎడ్యుకేషనల్ హబ్
డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు 95 శాతం జాబ్ చేస్తామని 5 శాతం మాత్రమే వ్యాపారం చేస్తామని చేతులు ఎత్తారు. అదే గుజరాత్ లాంటి రాష్ట్రంలో వ్యాపారం చేయడానికి 95 శాతం ముందుంటారు. ఇంటర్న్‌షిప్‌కి ఆదరణ పెరిగింది. ఉద్యోగం చేస్తాను కాదు ఉద్యోగం ఇస్తాను అనే ఆలోచనతో మీరందరూ ముందుకు వెళ్లాలి. సిద్దిపేట అన్ని రంగాల్లో ముందుండాలని నాలుగు పాలిటెక్నిక్ కాలేజీలు, ఒక గవర్నమెంట్ ఐటిఐ, మెడికల్ కాలేజ్ తెచ్చాను. మెడికల్ కాలేజ్ సిద్దిపేటకు రావాలనేది ఒక కల. అలాంటి కలను మనం నెరవేర్చుకున్నాం. రెండు మెడికల్ కాలేజీలు, రెండు నర్సింగ్ కాలేజీలు, రెండు పారామెడికల్ కాలేజీలు, బీఫార్మసీ కాలేజ్, బిఎస్సి అగ్రికల్చర్ కాలేజ్ ఇలా అన్ని విద్యాలయాలు సిద్దిపేటలో ఉన్నాయి. విద్యాపరంగా చాలా అభివృద్ధి చెందాం. ఇంకా అభివృద్ధి చెందుతాం. అది నా బాధ్యత. సిద్దిపేటలో ఐటీ టవర్‌ని కూడా తెచ్చి ఇక్కడి యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తున్నాం. సిద్దిపేట ఐటీ టవర్‌లో ఇంకా కొత్త కంపెనీలు కూడా వస్తున్నాయి. ఇక్కడి యువతకు మరిన్ని అవకాశాలు దక్కుతాయి. ఎక్కువ మంది యువతులే ఉద్యోగం చేయడం సంతోషం కలిగించిన విషయం. సిద్దిపేట ఒక ఎడ్యుకేషనల్ హబ్. రిజర్వాయర్లకు కూడా సిద్దిపేటనే హబ్. ఆలయాలకు కూడా సిద్దిపేట నిలయంగా మారిందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
పోటీ ప్రపంచంతో పోటీపడు..
పెద్ద పెద్ద నగరాలకు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు కానీ మన సిద్దిపేటకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది. సిద్దిపేట అంటే ఒకప్పుడు పందులకు ఫేమస్. సిద్ధిపేట అంటే ఒక మోడల్ టౌన్‌గా డెవలప్ చేసుకున్నాం. రైతుల కోసం గోదావరి నీళ్లు తెస్తే సిద్దిపేటలో లక్ష ఎకరాల్లో పంట పండుతున్నది. యువత గంజాయికి డ్రగ్స్‌కి బానిస అవుతున్నారు.. సోషల్ మీడియాకు, మొబైల్ ఫోన్స్‌కు అడిక్ట్ అవుతున్నారు. కొన్ని దేశాల్లో ఒక వయసు వచ్చేవరకు ఫోన్లు నిషేధించారు. ఈరోజు చిన్న పిల్లలు అన్నం తినాలంటే కూడా మొబైల్ ఫోన్ ఇచ్చే పరిస్థితి మన దగ్గర ఉంది. మొబైల్‌కి మనం బానిస కాకుండా మొబైల్‌ని సక్రమంగా యూస్ చేసుకొని మనం పైకి రావాలి. ఈ ఒక్క సంవత్సరం కష్టపడి చదివి మీరు ఉద్యోగం కొడితే మీ జీవితమే మారిపోతుంది. సంవత్సరం కష్టపడి జీవితాంతం సుఖపడదామా ఈ యొక్క సంవత్సరం ఎంజాయ్ చేసే జీవితాంతం కష్టపడదామా మీరే నిర్ణయించుకోండి. నేను పేదవాడిని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న అని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. పోటీ ప్రపంచంతో పోటీపడు. నీకు నువ్వే పోటీ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
పట్టుదల ఉండాలి కానీ ఏదైనా సాధించవచ్చు..
సిద్దిపేటలో రామచంద్రమని ఒక టేలర్. నలుగురు ఆడబిడ్డలు అతనికి. నలుగురు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మెడికల్ సీట్ కొట్టి ఈరోజు డాక్టర్ చదువుతున్నారు. ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్న. ఇంకో ఇద్దరు పిల్లల్ని డాక్టర్ చదివించడానికి శక్తి లేదని రామచంద్ర వచ్చినప్పుడు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత నేను తీసుకున్నాను. కావాల్సిందల్లా పట్టుదల. డెడికేషన్ ఉంటే ఎంతటిదాన్నైనా సాధించవచ్చు. జహీరాబాద్ మైనార్టీ రెసిడెన్షియల్ గురుకులాలను ప్రారంభించడానికి నేను వెళ్ళినప్పుడు అందులో ఒక అమ్మాయి డాక్టర్ అవుతానని చెప్పింది. ఈరోజు అమ్మాయి డాక్టర్ అయ్యి చూపించింది. జహీరాబాద్‌లో ఆటో డ్రైవర్ కూతురు గవర్నమెంట్ పాఠశాలలో చదువుకొని ఎంబిబిఎస్ సీట్ సాధించింది. పట్టుదల ఉండాలి కానీ ఏదైనా సాధించవచ్చు అని హరీశ్‌రావు తెలిపారు.
ఈ యాప్ మీ జీవితాన్ని మారుస్తుంది..
యాప్ తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. 10 ఏళ్ల నుంచి చదివినా గవర్నమెంట్ ఉద్యోగం రాలేదని కొంత మంది ఆత్మ విశ్వాసం కోల్పోతారు. ఎన్ని సంవత్సరాలు చదివామని కాదు.. సరైన ప్రణాళికతో చదివామా అనేది ముఖ్యం. ఈ యాప్ మీ జీవితాన్ని మారుస్తుంది. ఇది గేమ్ చేంజర్. హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకునే దానికంటే యాప్ ద్వారా మీరు లాభం పొందుతారు. మీ డెడికేషన్‌కు మీ పట్టుదలకు స్కై ఇస్ ద లిమిట్. కొత్త ఆలోచనలతో ముందుకు రండి. మీతో పాటు నలుగురికి దారి చూపించండి. ఈ యాప్‌ని మీరందరూ సద్వినియోగం చేసుకొని జీవితంలో పైకి రావాలని గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా సాధించాలని మనసారా కోరుకుంటున్నానని పేర్కొంటూ హరీశ్‌రావు తన ప్రసంగాన్ని ముగించారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్





