Job Mela | మైనార్టీ యువత ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నం : అజారుద్దీన్
Job Mela | మైనార్టీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు నైపుణ్యాన్ని మరింత మెరుగుపరచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మహ్మద్ అజారుద్దీన్ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మైనార్టీ సంక్షేమ శాఖ, తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీఎంఎఫ్‌సీ) ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళాను హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
Job Mela | మైనార్టీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు నైపుణ్యాన్ని మరింత మెరుగుపరచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మహ్మద్ అజారుద్దీన్ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మైనార్టీ సంక్షేమ శాఖ, తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీఎంఎఫ్‌సీ) ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళాను హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్ మేళా విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్‌తో పాటు భాగస్వామ్య సంస్థల ప్రతినిధులను అభినందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండేళ్లలో మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కీలక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.
రాష్ట్రంలో దాదాపు లక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, మైనార్టీ యువతను ఉద్యోగ అవకాశాలతో అనుసంధానం చేసేందుకు మైనార్టీ సంక్షేమ శాఖ, టీజీఎంఎఫ్‌సీ సమన్వయంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు సహా అన్ని మైనార్టీ వర్గాల యువతకు ఎలాంటి వివక్ష లేకుండా అవకాశాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. జాబ్ మేళా ఉద్దేశం కేవలం ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేయడం మాత్రమే కాదని, ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి స్థిరపడే వరకు ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని మంత్రి తెలిపారు. యువతకు ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి మెగా జాబ్ మేళాలను నిర్వహించి మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.

నిరుద్యోగ యువత విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. టీజీఎంఎఫ్‌సీ ఆధ్వర్యంలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వివిధ రంగాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. టీజీఎంఎఫ్‌సీ, అనుబంధ శిక్షణ సంస్థల సహకారంతో నిర్వహించిన ఈ మెగా జాబ్ మేళాలో 50 నుంచి 60 వరకు ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. లాజిస్టిక్స్, ఈ-కామర్స్, రిటైల్, హాస్పిటాలిటీ, మాన్యుఫాక్చరింగ్, ఆటోమొబైల్, నిర్మాణ రంగం, ఐటీఈఎస్, బీపీఓ, ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్, కార్పొరేట్ అడ్మినిస్ట్రేషన్ తదితర రంగాల్లో ఉద్యోగాలు కల్పించాయి.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2 వేల మంది మైనార్టీ యువత ఈ జాబ్ మేళాకు హాజరయ్యారు. ఉద్యోగ అవకాశాలతో పాటు కెరీర్ కౌన్సెలింగ్, నైపుణ్యాభివృద్ధి కోర్సుల నమోదు సదుపాయాలను కూడా నిర్వాహకులు కల్పించారు. దాదాపు 20 శిక్షణ సంస్థలు కూడా పాల్గొని తమ కార్యక్రమాలపై అవగాహన కల్పించాయి. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు ఫహీముద్దీన్ ఖురేషీ, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి బీ షఫీయుల్లా, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nithya Menen | మెగా ఫోన్ పట్టనున్న నిత్యా మీనన్ - థ్రిల్లర్ కథతో డెబ్యూ మూవీ
- ●Toll Tax | టోల్ ఫ్రీకి బ్రేక్.. ఇక ప్రభుత్వ అధికారులు కూడా టోల్ చెల్లించాల్సిందే..?
- ●Hyderabad Rains | హైదరాబాద్‌ను కమ్మేసిన కారుమేఘాలు.. దంచికొడుతున్న భారీ వర్షం..
- ●Tenant Farmers Report | యూరియా రాదు.. పంట కొనరు
- ●Mamata Banerjee | సంతకాల ఫోర్జరీ.. మమతా బెనర్జీ ఇంట్లో సీఐడీ సోదాలు
- ●ITR | ఐటీఆర్ ఫైల్ చేస్తే సరిపోదు.. ఈ కారణాలుంటే తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖ పరిశీలిస్తుంది..

Nithya Menen | మెగా ఫోన్ పట్టనున్న నిత్యా మీనన్ - థ్రిల్లర్ కథతో డెబ్యూ మూవీ

Toll Tax | టోల్ ఫ్రీకి బ్రేక్.. ఇక ప్రభుత్వ అధికారులు కూడా టోల్ చెల్లించాల్సిందే..?

Hyderabad Rains | హైదరాబాద్‌ను కమ్మేసిన కారుమేఘాలు.. దంచికొడుతున్న భారీ వర్షం..

Tenant Farmers Report | యూరియా రాదు.. పంట కొనరు





