త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | రేవంత్ రెడ్డిని క‌ల‌వాలంటే నాకు మెసేజ్ చేయండి.. స‌చివాల‌యంలో ఫేక్ పోలీస్ రీల్స్

Revanth Reddy | `హాయ్ అంద‌రికీ న‌మ‌స్తే.. నేను రేవంత్ రెడ్డి (Revanth Reddy) సెక్యూరిటీ ఏరియాలో ఉన్నా. అంటే ఆయ‌న‌ ఆఫీస్ ద‌గ్గ‌ర ఉన్న‌. ఎవ‌రైన రేవంత్ రెడ్డిని క‌ల‌వాలంటే నాకు మెసేజ్ చేయండి` అంటూ ఖాకీ యూనిఫామ్‌లో ఉన్న ఓ న‌కిలీ పోలీసు (Fake Police) చేసిన ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది.

G

Telangana | Published On Apr 29, 2026, 9.41 am IST

Revanth Reddy | రేవంత్ రెడ్డిని క‌ల‌వాలంటే నాకు మెసేజ్ చేయండి.. స‌చివాల‌యంలో ఫేక్ పోలీస్ రీల్స్
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: `హాయ్ అంద‌రికీ న‌మ‌స్తే.. నేను రేవంత్ రెడ్డి (Revanth Reddy) సెక్యూరిటీ ఏరియాలో ఉన్నా. అంటే ఆయ‌న‌ ఆఫీస్ ద‌గ్గ‌ర ఉన్న‌. ఎవ‌రైన రేవంత్ రెడ్డిని క‌ల‌వాలంటే నాకు మెసేజ్ చేయండి` అంటూ ఖాకీ యూనిఫామ్‌లో ఉన్న ఓ న‌కిలీ పోలీసు (Fake Police) చేసిన ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది.

అయితే ఆ వీడియోలో ఉన్న‌ది అస‌లు పోలీసే కాదు. పోలీస్ డ్రెస్ వేసుకొని సీఎం రేవంత్ రెడ్డిని కల్పిస్తానని ఏకంగా సెక్రటేరియట్‌లో (Secretariat) వీడియోలు చేసిన వ్య‌క్తిని నిఖిల్‌గా గుర్తించారు. ప్ర‌స్తుతం అత‌ని కోసం పోలీసులు ముమ్మ‌రంగా గాలిస్తున్నారు.

రీల్స్ కోసం పాత బస్తీలో పోలీస్ డ్రెస్ కొన్నాడ‌ని తెలిపారు. సీఎం రేవంత్‌ను క‌లిపిస్తాన‌ని, ఐపీఎల్ టికెట్స్ ఇప్పిస్తామంటూ వీడియోలు చేశాడ‌ని వెల్ల‌డించారు. అతడి మీద ఏపీలో పలు పోలీస్ స్టేషన్లలో చీటింగ్ నమోదైనట్లు తెలుస్తున్న‌ది.

కాగా, ఏకంగా సీఎంనే కల్పిస్తానని ఇలాంటి చీటర్లు సెక్రటేరియట్‌లో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్న‌ప్ప‌టికీ నిఘా వ‌ర్గాలు చోద్యం చూస్తున్నాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యే వ‌ర‌కు చ‌ల‌నం లేకుండా ఉంటున్నాయి. స‌చివాల‌యంలో భద్రతా లోపం అనేది ఇది మొదటిసారి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత డజన్ మంది దాకా ఇలా ఫేక్ ఐడెంటిటీతో సెక్రటేరియట్‌లోకి ప్ర‌వేశించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందో చెప్పేందుకు ఇది మరో ఉదాహరణ.

 

Advertisement
Advertisement