Telangana Praja Jagruthi | కవిత కొత్త పార్టీ.. తెలంగాణ ప్రజా జాగృతి..!
Telangana Praja Jagruthi | తెలంగాణ జాగృతి( Telangana Jagruthi ) అధ్యక్షురాలు కవిత స్థాపించబోయే పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి( Telangana Praja Jagruthi ) అని ఖరారు చేశారు.
Telangana Praja Jagruthi | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో మరో రాజకీయ పార్టీ( Political Party ) పురుడు పోసుకునేందుకు సమయం ఆసన్నమైంది. మే నెలలో కొత్త పార్టీ స్థాపించబోతున్నట్లు ఇటీవలే మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత( Kalvakuntla Kavitha ) ప్రకటించిన సంగతి తెలిసిందే. తన పార్టీలో తెలంగాణ( Telangana ) పదం తప్పకుండా ఉంటుందని ఆమె ప్రకటించారు. మరి ఆమె పార్టీ పేరు ఏమై ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు కొనసాగాయి.. కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో పేరు ఊహించుకున్నారు. అయితే చర్చలకు తెరపడినట్టు అయింది.
తెలంగాణ జాగృతి( Telangana Jagruthi ) అధ్యక్షురాలు కవిత స్థాపించబోయే పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి( Telangana Praja Jagruthi ) అని ఖరారు చేశారు. ఈ పేరును మే నెలలో ఆమె అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే కొత్త పార్టీకి సంబంధించిన ప్రకటనలను జాతీయ, తెలుగు దినపత్రికల్లో ఇవ్వనున్నారు. వారం రోజుల పాటు అట్టహాసంగా ఆవిర్భావ వేడుకలను నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. జాతీయ స్థాయి నేతలకు కూడా ఆహ్వానించనున్నారు. కొత్త పార్టీకి సంబంధించిన సమగ్ర కార్యాచరణలో కవితతో పాటు ఆమె బృందం నిమగ్నమై ఉంది. పార్టీ రూపకల్పన, విధివిధానాల వంటి కార్యాచరణలో నిత్యం ఆమె సీనియర్లతో, మేధావులతో, రాజకీయ విశ్లేషకులతో సమీక్షలు చేస్తున్నట్లు సమాచారం.
రాబోయే ఎన్నికల్లో సిద్దిపేట, బోధన్‌లో ఏదో ఒకచోటి నుంచి తాను పోటీ చేస్తానని కవిత ప్రకటించిన విషయం విదితమే. సిద్దిపేటకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని ఆమె స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



