Harish Rao | రాహుల్.. రాజ్యాంగం ఖూనీపై నోరు మెదపరేం? : హరీశ్‌రావు
Harish Rao | ఆదిలాబాద్ సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పరామర్శించారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న రేవంత్ సర్కార్..
కాంగ్రెస్ తొత్తులుగా మారిన పోలీసులు..
మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం ఆక్షేపణీయం..
రాహుల్ గాంధీ.. ప్రజా తీర్పును కాలరాస్తుంటే ఎందుకు మాట్లాడరు?
పోలీసులకు కౌంట్ డౌన్ స్టార్ట్
తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదు
బీఆర్ఎస్ నాయకులపైనే అక్రమ కేసులా..?
ఆదిలాబాద్ జైలు వద్ద మీడియాతో హరీశ్‌రావు
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : ఆదిలాబాద్ సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న విద్యార్థి నాయకుడు బాల్క సుమన్‌తో పాటు రాజిరెడ్డి, అనిల్ లక్ష్మీకాంత్‌లను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. రామగుండం కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లితో పాటు ఆసిఫాబాద్‌లో జైళ్లు ఉన్నప్పటికీ.. వాళ్లను అక్కడ పెట్టకుండా కక్షపూరితంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్ జైలుకు తీసుకువచ్చి పెట్టడం దుర్మార్గమని హరీశ్‌రావు మండిపడ్డారు.
క్యాతన్‌పల్లిలోని 22 స్థానాలకు గాను 14 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. బీఆర్ఎస్, సీపీఐ కూటమిని ప్రజలు గెలిపించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును మంత్రి వివేక్ శిరసావహించాల్సింది పోయి, ఇలా ప్రజా తీర్పును కాలరాయడం సరికాదు. కోరం ఉన్నప్పటికీ చైర్మన్ ఎన్నిక రోజు కావాలనే పోలీసు బందోబస్తు లేకుండా చేసి, చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా పడేలా చేశారు. అధికారులు, పోలీసుల సమక్షంలో, మంత్రి వివేక్ చూస్తుండగానే దళిత, గిరిజన, మహిళా కౌన్సిలర్లపై దౌర్జన్యంగా, నోటితో చెప్పలేని విధంగా అసభ్యంగా ప్రవర్తించారు. మహిళలపై చేయి చేసుకున్నారు. మహిళలపై దాడి జరుగుతున్నప్పుడు వివేక్ మంత్రి హోదాలో అక్కడే ఉండి కూడా కనీసం పట్టించుకోకపోవడం, కోరం ఉన్నా ఎన్నిక వాయిదా వేసి వెళ్లిపోవడం శోచనీయమని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారిపై కేసులు ఉండవు కానీ, మా కౌన్సిలర్లపై మాత్రం అక్రమ కేసులు
క్యాతన్‌పల్లి మహిళా కౌన్సిలర్ల తరపున రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళితే కనీసం కంప్లైంట్ తీసుకోలేదు. కౌన్సిల్‌కు మద్యం తాగి వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు? రాజిరెడ్డి కారు ధ్వంసం చేసిన వారిపై కేసులు ఉండవు కానీ, మా కౌన్సిలర్లపై మాత్రం అక్రమ కేసులు పెట్టారు. బాల్క సుమన్, కోవా లక్ష్మీలను ఎమ్మెల్యేలుగా ఉండి కూడా లోపలికి పంపించకుండా.. కేవలం మంత్రిని ఎలా పంపిస్తారని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మాపై దాడి చేశారు. పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులతో అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్ గుండాలు స్టేషన్‌కు వచ్చి మరీ కొడుతున్నారు. ఈ రకమైన దాడులు మంచివి కావు అని హరీశ్‌రావు హెచ్చరించారు.
భయభ్రాంతులకు గురిచేయడానికే పోలీసులు కవాతు
పోలీస్ కవాతు ప్రజలకు రక్షణ కల్పించాలి. ప్రజల్లో విశ్వాసం నింపాలి. కానీ జనగామ, ఇబ్రహీంపట్నం, ఆమన్‌గల్, క్యాతన్‌పల్లిలో బీఆర్ఎస్ నాయకులను, కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేయడానికే పోలీసులు కవాతు చేశారు. ఇబ్రహీంపట్నంలో మాకు స్పష్టమైన మెజార్టీ ఉన్నా ఎన్నికను అడ్డుకునే ప్రయత్నం చేశారు. జనగామలో ఓటింగ్ కోసం మా కౌన్సిలర్ చేతి పైకెత్తితే.. వెనుక నుండి కాంగ్రెస్ కౌన్సిలర్లు చేతులు పట్టి లాగి బెదిరించే ప్రయత్నం చేశారు. అందులో దళిత మహిళ చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించడం దుర్మార్గం. ఒక ఎంపీ అన్యాయంగా రెండోసారి తొర్రూరులో ఓటు నమోదు చేసుకొని ఓటు వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని మాజీ మంత్రి మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి.. మీరు ప్రజా ఆమోదాన్ని కోల్పోయారు.,
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కేవలం నాలుగే మున్సిపాలిటీలు గెలిచింది. మేము ఇప్పుడు దాదాపు 800 మంది కౌన్సిలర్లను గెలుచుకున్నాం. అప్పుడు మేం ఏనాడూ ఇలా చేయలేదు. అక్రమంగా పోలీసులను అడ్డం పెట్టుకుని దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. దొడ్డిదారిన పదవులు దక్కించుకునే ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి.. మీరు ప్రజా ఆమోదాన్ని కోల్పోయారు. కాంగ్రెస్, బీజేపీల మైత్రి ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకుడు, బీజేపీ ఎంపీ పోలీసులను పట్టుకుని అడ్డగోలుగా బూతులు తిట్టినా ఇప్పటివరకు వారిని అరెస్ట్ చేయలేదని హరీశ్‌రావు గుర్తు చేశారు.
ఇదేనా రాజ్యాంగాన్ని పరిరక్షించడం అంటే?
రాహుల్ గాంధీ ఈరోజు ఢిల్లీలో తెలంగాణ క్యాబినెట్‌తో రివ్యూ చేస్తున్నారు. దేశంలో ఎక్కడికి పోయినా చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో ప్రజాభిప్రాయాన్ని ఖూనీ చేస్తున్న రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ఇదేనా రాజ్యాంగాన్ని పరిరక్షించడం అంటే? తెలంగాణలో పట్టపగలు రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించరు? రాష్ట్ర ఇంచార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ఎందుకు నోరు విప్పరు? ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని అధికారులపై, క్యాతన్‌పల్లి ఇన్సిడెంట్ పైన గవర్నర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. తప్పు చేసిన అధికారుల మీద, ఎన్నికల కమిషన్ మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు.
పోలీసులకు కౌంట్ డౌన్ స్టార్ట్.. ఎవరూ మిమ్మల్ని కాపాడలేరు
ప్రజా తీర్పును కాలరాసినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయి. పోలీసు అధికారులకు మేము చెప్పేదొకటే.. అధికారం శాశ్వతం కాదు. అన్ని కాలాలు ఒకే తీరుగా ఉండవు. కాలం మారుతుంది, రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. పోస్టింగ్‌ల కోసం నాయకుల చెప్పుచేతల్లో పనిచేయకూడదు. చట్టాన్ని అతిక్రమించి, పరిధులు దాటి బీఆర్ఎస్ నాయకుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు తీవ్ర మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.. అప్పుడు రేవంత్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఎవరూ మిమ్మల్ని కాపాడలేరు. మీరు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు అని హరీశ్‌రావు హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

KTR | పళ్లు ఇకిలించుకుంటూ సెల్ఫీలు.. కేటీఆర్‌పై రేవంత్ విమర్శలు
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



