త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSPDCL | టీజీఎస్పీడీసీఎల్‌లో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా బ‌దిలీల ప‌ర్వం

TGSPDCL | టీజీఎస్పీడీసీఎల్‌లో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా బ‌దిలీల ప‌ర్వం కొన‌సాగుతున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఉన్న‌తాధికారుల‌పై విద్యుత్ ఉద్యోగులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

S

Telangana | Published On Mar 4, 2026, 4.40 pm IST

TGSPDCL | టీజీఎస్పీడీసీఎల్‌లో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా బ‌దిలీల ప‌ర్వం
Advertisement

TGSPDCL | త్రినేత్ర‌.న్యూస్ : టీజీఎస్పీడీసీఎల్‌లో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా బ‌దిలీల ప‌ర్వం కొన‌సాగుతున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఉన్న‌తాధికారుల‌పై విద్యుత్ ఉద్యోగులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ డీఈ పోస్టింగ్‌లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఒకే పోస్టులో ఇద్ద‌రు అధికారులు కొన‌సాగుతున్నారు.

గ‌త నెల‌ 28న ప‌ద‌వీ విర‌మ‌ణ పొందాల్సిన‌ జయరాములు పదవిలో ఉండగానే.. 26వ తేదీనే చంద్రశేఖర్‌కు పోస్టింగ్ ఇవ్వడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ​బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ.. నిబంధనలు తుంగలో తొక్కి 20 నుంచి 25 మంది ఇంజనీర్లను బ‌దిలీ చేసిన‌ట్టు స‌మాచారం. ఆగ‌మేఘాల మీద ఆర్డ‌ర్లు ఇవ్వ‌డంతో.. ఎస్పీడీసీఎల్ ఉన్న‌తాధికారుల తీరుపై అవినీతి ఆరోప‌ణ‌లు వెలువెత్తుతున్నాయి. విద్యుత్ శాఖ‌లో బ‌దిలీలు అవినీతికి ప‌రాకాష్టగా మారాయ‌ని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ బ‌దిలీల‌పై తక్షణమే విచారణ జరిపించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ​సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క జోక్యం చేసుకుని అక్ర‌మ బ‌దిలీల‌ను ర‌ద్దు చేయాల‌ని ఆయా ఉద్యోగ సంఘాల నేత‌లు కోరుతున్నారు.

Advertisement
Advertisement