త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Balu Naik | ఆరు గ్యారెంటీల‌పై ప్ర‌జ‌లెవ‌రూ నిల‌దీయ‌డం లేదు : ఎమ్మెల్యే బాలు నాయ‌క్

MLA Balu Naik | కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమ‌లు కోసం ప్ర‌జ‌లెవ‌రూ త‌మ‌ను నిల‌దీయ‌డం లేద‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయ‌క్ శాస‌న‌స‌భ‌లో పేర్కొన్నారు. దీంతో బీఆర్ఎస్ స‌భ్యులు క‌ల్పించుకోని, అబ‌ద్ధాలు చెప్ప‌డం స‌రికాదు.. ఆరు గ్యారెంటీల‌ను ఎక్క‌డ అమ‌లు చేశారో చెప్పాల‌ని ర‌న్నింగ్ కామెంట్రీ చేశారు.

S

Telangana | Published On Mar 17, 2026, 11.03 am IST

MLA Balu Naik | ఆరు గ్యారెంటీల‌పై ప్ర‌జ‌లెవ‌రూ నిల‌దీయ‌డం లేదు : ఎమ్మెల్యే బాలు నాయ‌క్
Advertisement

MLA Balu Naik | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమ‌లు కోసం ప్ర‌జ‌లెవ‌రూ త‌మ‌ను నిల‌దీయ‌డం లేద‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయ‌క్ శాస‌న‌స‌భ‌లో పేర్కొన్నారు. దీంతో బీఆర్ఎస్ స‌భ్యులు క‌ల్పించుకోని, అబ‌ద్ధాలు చెప్ప‌డం స‌రికాదు.. ఆరు గ్యారెంటీల‌ను ఎక్క‌డ అమ‌లు చేశారో చెప్పాల‌ని ర‌న్నింగ్ కామెంట్రీ చేశారు.

బాలు నాయ‌క్ తీవ్రంగా స్పందిస్తూ.. ఆరు గ్యారెంటీల‌కు చ‌ట్ట‌బ‌ద్ధత క‌ల్పించాల‌ని బీఆర్ఎస్ స‌భ్యులు న‌ల్ల‌బ్యాడ్జీలు వేసుకుని గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి అడ్డు త‌గిలే ప్ర‌య‌త్నం చేశారు. గ‌త ప‌దేండ్ల కాలంలో మీరిచ్చిన హామీల్లో ఎన్ని నెర‌వేర్చారో తిరిగి చూసుకోవాల‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి సూచిస్తున్నాం. ఆరు గ్యారెంటీల‌ను చిత్త‌శుద్ధితో అమ‌లు చేస్తున్నాం. 24 గంట‌ల పాటు ప్ర‌జ‌ల్లో ఉంటున్నాం. గ్యారెంటీలు అమ‌లు చేయ‌డం లేద‌ని ప్ర‌జ‌లు నిల‌దీయ‌డం లేదు. మీ కంటే ఎక్కువ జ‌నాల్లో ఉన్నాం. ఇందిర‌మ్మ ఇండ్లు, స‌న్న‌బియ్యం, మ‌హిళ సంఘాల‌కు ఇచ్చే రుణాలు క‌న‌బ‌డ‌డం లేదా..? తెలంగాణ రాష్ట్ర ప్ర‌జానీకం గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంతో సంతోషంగా ఉన్నారని బాలు నాయ‌క్ తెలిపారు.

నిన్న గ‌వ‌ర్న‌ర్ ప్రసంగం సంద‌ర్భంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు స‌భ‌కు హాజ‌రు కాలేదు. స‌భ‌కు రాక‌పోవ‌డం ఈ రాష్ట్రానికి పెద్ద ద‌రిద్య్రం. జీత‌భత్యాలు తీసుకుని ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. ఆరు గ్యారెంటీల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల‌ని కోరే నైతిక హ‌క్కు మీకు లేదు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు అసెంబ్లీకి రావాల‌ని బీఆర్ఎస్ స‌భ్యులు న‌ల్ల అంగీలు వేసుకుని నిర‌స‌న చేప‌ట్టాలి. ఈ ప్ర‌భుత్వాన్ని ఎన్ని ర‌కాలుగా ఇబ్బంది పెట్టాల‌ని ప్ర‌య‌త్నించాల‌ని, బ‌ద్నాం చేయాల‌నుకున‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితి లేదు. పంచాయ‌తీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో రేవంత్ నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌రిచారు. ఇప్ప‌టికైనా మీరు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా బాధ్య‌త వ‌హించి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని కోరుతున్నాం. లేదంటే భ‌విష్య‌త్ కూడా ఉండ‌దు అని ఎమ్మెల్యే బాలు నాయ‌క్ హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement