త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Huzurabad | బీఆర్ఎస్‌లో గంద‌ర‌గోళం.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై క్యాడ‌ర్ గుర్రు!

BRS Huzurabad | హుజూరాబాద్‌ బీఆర్ఎస్‌ (BRS)లో గంద‌రగోళం నెల‌కొంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై నాయకులు, కార్యకర్తలు (Leaders) తీవ్ర అసంతృప్తి (Dissatisfaction)తో ఉన్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా జమ్మికుంట (Jammikunta) శివారులోని ఓ వెంచర్‌లో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు రహస్య సమావేశం (Secret Meeting) ఏర్పాటు చేయ‌గా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

S

Telangana | Published On Mar 21, 2026, 4.54 pm IST

BRS Huzurabad | బీఆర్ఎస్‌లో గంద‌ర‌గోళం.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై క్యాడ‌ర్ గుర్రు!
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: హుజూరాబాద్‌ బీఆర్ఎస్‌ (BRS)లో గంద‌రగోళం నెల‌కొంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై నాయకులు, కార్యకర్తలు (Leaders) తీవ్ర అసంతృప్తి (Dissatisfaction)తో ఉన్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా జమ్మికుంట (Jammikunta) శివారులోని ఓ వెంచర్‌లో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు రహస్య సమావేశం (Secret Meeting) ఏర్పాటు చేయ‌గా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కౌశిక్ కు గిట్ట‌నివారు పార్టీకి దూరం కావ‌డానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నాయకుల రహస్య భేటీయే ఇందుకు బ‌లం చేకూర్చుతుంద‌ని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

క్యాడ‌ర్ ర‌హ‌స్య భేటీ...

మాజీ మున్సిపల్ ఛైర్మన్లు, సర్పంచులు, నాయకులు, కార్య‌క‌ర్త‌లు వందమంది వ‌ర‌కు రహస్యంగా స‌మావేశ‌మైన‌ట్లు స‌మాచారం. సీనియర్ నేత‌లు, మండల స్థాయి నాయ‌కులతో కౌశిక్ వ్యవహారం సరిగా లేదనే ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ మారాలా? బీఆర్ఎస్‌లోనే కొన‌సాగుతూ ఎమ్మెల్యే కౌశిక్‌పై పోరాటం చేయాలా? అనేదానిపై సమాలోచనలు చేస్తున్న‌ట్లు తెల‌స్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement