CM Revanth Reddy | ఏడాదిలోపే 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేస్తామని నిరుద్యోగ యువకులకు సీఎం విజ్ఞప్తి చేశారు. అందెశ్రీ జయంతి సందర్భంగా ఆయన స్మృతి వనానికి సీఎం రేవంత్ భూమిపూజ చేశారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేస్తామని నిరుద్యోగ యువకులకు సీఎం విజ్ఞప్తి చేశారు. అందెశ్రీ జయంతి సందర్భంగా ఆయన స్మృతి వనానికి సీఎం రేవంత్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు.
మేకతోలు కప్పుకున్న తోడేళ్ల గుంపు బయటకు వచ్చి.. కేసీఆర్ నోటిఫికేషన్లు ఇస్తే.. రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చిండని అంటున్నారు. ఆనాడు నీ చెల్లెలిని బండకేసి కొడితే ఆరు నెలలు తిరగకుముందే ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. వినోద్ కుమార్‌ను పార్లమెంట్ ఎన్నికల్లో గోసి తీసి పాతిపెడితే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష ఉద్యోగం ఇచ్చారు కదా. హరీశ్‌రావుకో కేటీఆర్‌కో దయాకర్ రావుకో వందలాది మంది మీ బంధువులకు ఉద్యోగాలు, మంత్రి పదవులు ఇచ్చారు. గంట కూడా ఆలస్యం చేయకుండా పదవులు అనుభవించారు కదా అని రేవంత్ అన్నారు.
నిరుద్యోగుల ఉద్యోగాల గురించి ఆలోచన చేశావా..?
నిరుద్యోగుల ఉద్యోగాల గురించి ఆలోచన చేశావా..? టీచర్లు, పోలీసులు, డాక్టర్లు, నర్సులు, ఇంజినీర్ల నియామకాలు చేపట్టవా. గ్రూప్స్ పరీక్షలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపట్టవా.. రేవంత్ నోటిఫికేషన్లు ఇవ్వలేదు.. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామకాలు ఇచ్చారని నడిబజార్లో నిలబడి మాట్లాడుతున్నవ్ కదా..? ఒక్కటి అడుగుతున్నా నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్నప్రతాలను జిరాక్స్ సెంటర్లో పల్లీబఠాణీల మాదిరి అమ్ముకుని లక్షల కోట్లు సంపాదించుకున్నవ్ కదా..? ఈ పరీక్షలను పూర్తి చేసి నియామక పత్రాలు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా..? మీ కుటుంబ సభ్యులను ప్రజలు బండకేసి కొడితే వెంబడే ఉద్యోగాలు ఇచ్చి పండగలు జరుపుకున్నారు. నిరుద్యోగ యువకులు ఏళ్ల పాటు కోచింగ్ సెంటర్లు చుట్టూ తిరిగితే ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఆలోచన వచ్చిందా..? మానవీయ కోణంలో మనుషులుగా ప్రవర్తించారా అని అడుగుతున్నానని సీఎం నిలదీశారు.
16 ఏండ్ల తర్వాత నియామకాలు చేపట్టాం
ఉమ్మడి ఏపీలో గ్రూప్-1 నిర్వహిస్తే.. మేం వచ్చాక 16 ఏండ్ల తర్వాత నియామకాలు చేపట్టాం. 67674 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఎల్‌బీ స్టేడియం, శిల్పారామం, నెక్లెస్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నియామక పత్రాలు అందించాం. చిల్లర మాటలు మాట్లాడి నాయకులమని చెప్పుకునే వారిని సూటిగా అడుగుతున్నా.. 10 ఏళ్లలో నోటిఫికేషన్లు ఇస్తే నియామకాలు చేయలేదు కదా.. ఏడాది లోపు 70 వేల ఉద్యోగాలు మేం ఎలా చేపట్టామని రేవంత్ ప్రశ్నించారు.
తాజావార్తలు
- ●Why People Avoid Jewelry | మెడలో, చేతులకు ఎలాంటి ఆభరణాలు ధరించని వారి సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా?
- ●TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!
- ●AV Ranganath | బడా మాఫియాను అడ్డుకున్నందుకే నాపై ఆ 63 కేసులు.. బిల్డర్ల పేర్లతో ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన!
- ●Telangana Journalists Housing | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ షురూ: ఫేక్ పేర్లకు చెక్ పెడుతూ మీడియా అకాడమీ అర్జెంట్ ఆదేశాలు!
- ●Ranganath | రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం.. ఇరకాటంలో రేవంత్ సర్కారు..! ఢిల్లీ నుంచే మంతనాలు..?
- ●KTR Delhi visit | ఢిల్లీలో కేటీఆర్.. తెలంగాణ బిడ్డ సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్న మాజీ మంత్రి

Why People Avoid Jewelry | మెడలో, చేతులకు ఎలాంటి ఆభరణాలు ధరించని వారి సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా?

TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!

AV Ranganath | బడా మాఫియాను అడ్డుకున్నందుకే నాపై ఆ 63 కేసులు.. బిల్డర్ల పేర్లతో ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన!

Telangana Journalists Housing | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ షురూ: ఫేక్ పేర్లకు చెక్ పెడుతూ మీడియా అకాడమీ అర్జెంట్ ఆదేశాలు!





