KTR | కొలంబియా బిజినెస్ స్కూల్‌లో కేటీఆర్ ప్రసంగం
KTR | కొలంబియా యూనివర్సిటీలో జరగనున్న ఓ కీలక సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఆయనకు జనవరి నెలలోనే ఆహ్వానం అందింది.
భారత వ్యాపార విధానాలపై ఏప్రిల్ 4న చర్చ
ఆక్స్‌ఫర్డ్, కొలంబియా, నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీల్లో
ఇప్పటికే.. లెక్చర్ ఇచ్చిన కేటీఆర్
KTR | త్రినేత్ర.న్యూస్ : కొలంబియా యూనివర్సిటీలో జరగనున్న ఓ కీలక సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఆయనకు జనవరి నెలలోనే ఆహ్వానం అందింది. ది న్యూ ఇండియా ప్లేబుక్..అనే పేరుతో ఏప్రిల్ 4న న్యూయార్క్‌లో జరగనున్న ఈ సదస్సులో భారతీయ వ్యాపారాలు, వ్యూహాలు, సుస్థిరతపై అనేక రంగాలకు చెందిన ప్రముఖులు ప్రసంగించనున్నారు. India's Rise: Rewriting the global business playbook అనే టాపిక్ పై వచ్చే శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 వరకు మాట్లాడనున్నారు. కొలంబియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థి విభాగం ‘South Asia Business Association’ (SABA) ఈ కార్యక్రమాన్ని గత 21 ఏళ్లుగా నిర్వహిస్తూ వస్తున్నది. ఈ ఏడాది నిర్వహిస్తున్న వ్యాపార రంగంలో లబ్ధప్రతిష్టులైన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు.
ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, నార్త్ వెస్టర్న్
కాగా ఇప్పటి వరకు కేటీఆర్ పలు ప్రతిష్టాత్మక గ్లోబల్ యూనివర్సిటీల్లో, వేదికలపై వివిధ అంశాలపై లెక్చర్ ఇచ్చారు. 2025 ఏప్రిల్‌లో అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలో.. తెలంగాణ స్టార్టప్ విప్లవానికి కీలక పాత్ర పోషించిన టీ హబ్, వర్క్స్, వీ హబ్‌లపై చర్చించారు. అదే ఏడాది జూన్‌లో లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో “Governing Innovation – A Telangana Case Study.” అనే అంశంపై... 2014 నుంచి తెలంగాణ సాధించిన అభివృద్ధిని వివరించారు. గత ఏడాది ఏప్రిల్‌లో లండన్‌లోని మేథాపరమైన వేదిక బ్రిడ్జ్ ఇండియా నుంచి projecting Telangana as a global case study in sustainable growth and innovation అనే టాపిక్‌లో తెలంగాణ అభివృద్ధి ఎలా సాధించగలిగిందో విశ్లేషించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హార్వర్డ్ యూనివర్సిటీలో The India We Imagine అనే టాపిక్‌పై మాట్లాడారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



