KTR | 2014లోనే జీవన్ రెడ్డిని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR | మాజీ మంత్రి, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించామని, ఆయన సానుకూలంగా స్పందించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే 2014లోనే జీవన్ రెడ్డిని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు కేసీఆర్.. కానీ నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగారని కేటీఆర్ గుర్తు చేశారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : మాజీ మంత్రి, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించామని, ఆయన సానుకూలంగా స్పందించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే 2014లోనే జీవన్ రెడ్డిని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు కేసీఆర్.. కానీ నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగారని కేటీఆర్ గుర్తు చేశారు. జగిత్యాలలో జీవన్ రెడ్డిని కలిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచన మేరకు జీవన్ రెడ్డిని పార్టీకిలోకి సాదరంగా ఆహ్వానించాం. కాంగ్రెస్ పార్టీతో ఆయనకు నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. ప్రజాజీవితంలో అనేక సేవలందించారు. మీ అందరికి తెలవని విషయం ఏంటంటే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఫిబ్రవరి 20 నాడు పాసైన తర్వాత.. 2014 ఎన్నికలకు ముందు కేసీఆర్ జీవన్ రెడ్డిని ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వంలో మీరుంటే బాగుంటుందని ఆహ్వానించారు. కానీ నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీని వెన్నంటి ఉన్నారు. జగిత్యాల ఎమ్మెల్యేగా 2014లో గెలిచారని కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్‌తో జీవన్ రెడ్డికి నాలుగు దశాబ్దాలకు పైగా స్నేహం
కేసీఆర్‌తో జీవన్ రెడ్డికి ఉన్న స్నేహం ఈ రోజుది కాదు. నాలుగు దశాబ్దాలకు పైగా స్నేహం ఉంది. 2014లో కేసీఆర్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే అధికారిక పర్యటన ప్రారంభమైంది. ఇక్కడే ఒక ఆడిటోరియంలో మీటింగ్ జరిగింది. సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష నేత జీవన్ రెడ్డికి మైక్ ఇవ్వాలని కేసీఆర్ చెప్పారు. ఇక అభినందనలు చెప్పిన జీవన్ రెడ్డి.. మీరు గవర్నమెంట్‌లో ఉన్నారని చెప్పి.. జగిత్యాల ప్రజల తరపున బోర్నపల్లి గ్రామానికి బ్రిడ్జి కావాలని అడిగారు. కేసీఆర్ దాటవేయకుండా.. జీవన్ రెడ్డి మీదున్న గౌరవంతో, ప్రేమతో క్షణంలోనే రూ. 75 కోట్లతో బ్రిడ్జిని మంజూరు చేశారు. ఇంకో సందర్భం గుర్తుకు వస్తుంది. రైతుల గురించి గట్టిగా మాట్లాడే నాయకుడు జీవన్ రెడ్డి. నిజాం షుగర్స్ ఇంపార్టెంట్ సబ్జెక్టు.. తెరిపించాలని కొట్లాడేవారు. తెరిపిస్తాం కానీ.. మహారాష్ట్రలో సహకార వ్యవస్థలో అక్కడ షుగర్ మిల్లులు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. కోఆపరేటివ్ సిస్టమ్ అమలు చేస్తే బాగుంటుందని నిండు శాసనసభలో జీవన్ రెడ్డికి కేసీఆర్ సూచించారు. ప్రభుత్వం రూ. 300 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉంది.. మీరు చైర్మన్‌గా ఉండాలని కేసీఆర్ ఆఫర్ ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు.
జీవన్ రెడ్డి లాంటి నిఖార్సైన నాయకులను కాంగ్రెస్ అవమానించింది
జీవన్ రెడ్డి లాంటి నిఖార్సైన నాయకులను కాంగ్రెస్ అవమానించింది. ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. భట్టి విక్రమార్క కొడుకు పెళ్లికి పోతే 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి మీ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. అది సందర్భం కాదు.. రాజకీయ వేదిక కాదు. సామాన్య కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఇలా ఉంటే.. రైతులు, ప్రజలు, నిరుద్యోగ యువత పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అధికారం ఉందని ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. కేసీఆర్‌తో పాటు పెద్దలను అవమానించేలా మాట్లాడుతున్నారు. అధికారం ఎవరి సొత్తు కాదు. పదేండ్లు మాకు, ఐదేండ్లు రేవంత్‌కు అవకాశం ఇచ్చారు. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది మళ్లీ అధికారంలోకి వస్తామని. కేసీఆర్ తరపున జీవన్ రెడ్డిని ఆహ్వానించాం. వారు సానుకూలంగా స్పందించారు. కేసీఆర్‌ను కలిసి నా నిర్ణయం తప్పకుండా చెబుతానని చెప్పారు. ఈ రాష్ట్రంలో రైతులు, పేదలు ముఖంలో చిరునవ్వు రావాలంటే కేసీఆర్ సీఎం అయ్యి బాధ్యత చేపట్టాల్సిందే.. అభివృద్ధిని పట్టాలు ఎక్కించాల్సిందే. ఇక జీవన్ రెడ్డికి మా వైపు నుంచి ఆహ్వానం మాత్రమే కాదు.. సముచితమైన స్థానం, గౌరవం కల్పిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
జీవన్ రెడ్డి చేరిక పార్టీకి లాభం..
జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ నాయకత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయించినప్పుడు ఎల్ రమణ, దావ వసంత్‌తో పాటు పలువురు నేతలు.. ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తే బాగుంటుందని చెప్పారు. జీవన్ రెడ్డి చేరిక పార్టీకి లాభం జరుగుతదని చెప్పి వెల్‌కమ్ చెప్పారని కేటీఆర్ తెలిపారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



