Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
Dasoju Sravan | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు, పాలనా విధానాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన సీఎం తీరును తప్పుబడుతూ పలు అంశాలపై విమర్శలు చేశారు. సమయం, సందర్భం, విచక్షణ లేకుండా మాట్లాడే వారిని మూర్ఖులు అంటారన్నారు.
Dasoju Sravan | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు, పాలనా విధానాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన సీఎం తీరును తప్పుబడుతూ పలు అంశాలపై విమర్శలు చేశారు. సమయం, సందర్భం, విచక్షణ లేకుండా మాట్లాడే వారిని మూర్ఖులు అంటారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కి బూతు పంచాంగం తప్ప ఏదీ తెలియదని, సీఎం కుర్చీలో కూర్చున్న కూడా కుక్క తోక వంకర అన్నట్టు రేవంత్ వ్యవహారం ఉందని విమర్శించారు. రేవంత్ రెడ్డిని చూస్తే జాలేస్తుంది, కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారన్నారు. అందెశ్రీ జయంతి రోజున అందరికీ స్ఫూర్తి దాయకంగా ఉండాలని అందరూ ఆశిస్తారని, పెళ్లికొచ్చి చావు డప్పు కొట్టినట్టు సీఎం వ్యవహరించారని విమర్శించారు. అందెశ్రీ, గద్దర్ ఆత్మలు రేవంత్ స్పీచ్‌తో క్షోభించాయని, రేవంత్ కవుల భుజాల మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నారని ఆరోపించారు. ఆయన సీఎం ఏందీ.. మనం తెలంగాణలో ఉండటమే దురదృష్టం అనే పరిస్థితి తలెత్తిందన్నారు. అసలు రేవంత్ మనిషేనా ?నీలో రక్తం ఉందా చీము ఉందా ? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సమాధి చేస్తానంటావా?
నీ కంటే వయసులో ఎంతో పెద్దవాడైన కేసీఆర్ ను సమాధి చేస్తానంటావా ? అంటూ రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. నీకు అక్షరాభ్యాసం చేసిన వాడిని అనాలంటూ ఘాటుగా స్పందించారు. అందె శ్రీ తెలంగాణ గీతాన్ని కీరవాణి మ్యూజిక్‌తో అవమానించారని, కేసీఆర్ అందె శ్రీతో జననీ జయకేతనం పాట పాటించలేదా ? అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఓ రైఫిల్ రెడ్డి.. నాడు డ్రామానే నేడు డ్రామానేనన్నారు. అందెశ్రీని నాడు నేడు రాజకీయంగా వాడుకుంటున్నారని, గద్దర్ మీద గౌరవం ఉంటే ఏదైనా యూనివర్సిటీకి పేరు పెట్టాల్సిందని, సినిమా అవార్డులకు గద్ధర్ పేరును పెట్టి చేతులు దులుపుకుంటావా ? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ కోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టారని, త్యాగాలకు చిరునామా కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ఉద్యమ కారుడనే గౌరవం ఎందుకు లేదని.. రేవంత్ స్వతంత్ర పోరాటంలో పాల్గోని జైలుకు వెళ్లాడా ? అంటూ ప్రశ్నించారు. తెలంగాణను ఏపీని కలిపే కుట్రలో భాగంగా ఓటుకు నోటు కేసు లో రేవంత్ పాల్గొన్నాడని, రేవంత్ చేసిన పనికి జీవితాంతం జైలులో పెట్టాలన్నారు. మళ్లీ ఇప్పుడు సుద్దపూసలా మాట్లాడుతున్నాడని, తాడే గదా అని మెడలో వేసుకుంటే రేవంత్ తెలంగాణ పాలిట పాముగా తయారయ్యాడని ఆరోపించారు. తాను పద్దెనిమిది గంటలు కష్టపడతున్నా అని రేవంత్ రెడ్డి అంటున్నారని.. పద్దెనిమిది గంటలు కష్టపడితే రాష్ట్రం పరిస్థితి ఇలా ఉంటుంది ? అంటూ నిలదీశారు.
దోపిడీ దొంగల్లా తయారయ్యారు
సీఎం, ఆయన మంత్రులు పెద్ద దోపిడీ దొంగల్లా తయారు అయ్యారని దాసో విమర్శించారు. వేల ఎకరాల భూమి,వేల కోట్ల డబ్బును సీఎం, మంత్రులు దోచుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఎంత మంది నిఖార్సైన తెలంగాణ ఉద్యమ కారులకు పదవులిచ్చారు ? ఎంత మంది ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు పదవులిచ్చారు..కేసీఆర్ ఈ ప్రెస్ మీట్ లో కూర్చున్న రాకేశ్, ఉపేంద్ర చారిలకు పదవులిచ్చారు.. వాళ్ళు ఉద్యమ కారులు కాదా ?.. ఇలాంటి వారెందరికో పదవులు ఇచ్చింది కేసీఆర్ కాదా ? అంటూ నిలదశారు. పొంగులేటి ఒరిజినల్ కాంగ్రెస్సా ? ఎందుకు మంత్రి పదవి ఇచ్చావా ?..కేసీఆర్ హయాంలో పేపర్ లీకేజీలు అని రేవంత్ అంటున్నాడని.. దొంగలను పట్టుకుంది కేసీఆర్ కాదా ? ఇపుడు రేవంత్ దోషులను కాపాడుతున్నాడని.. ఎందుకంటే వాళ్ళు ఆయన దోస్తులేనని విమర్శించారు. 70వేల ఉద్యోగాలు ఇచ్చానని రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాన్నే మళ్లీ చెబుతున్నారని, రేవంత్ ఇచ్చిన ఉద్యోగాలు16వేలకు మించి లేవన్నారు. దమ్ముంటే అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరకు చర్చకు రా అంటూ సవాల్ విసిరారు. రేవంత్ ఉద్యోగాలు ఇవ్వడం భిక్ష కాదు ప్రభుత్వ బాధ్యత అన్నారు. జీవో 29 తెచ్చి వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేశాని ఆరోపించారు. గ్రూప్ వన్ పరీక్షను తప్పుల తడకగా నిర్వహించారని, కానిస్టేబుల్ ఉద్యోగాలు 19 వేలు ఖాళీ ఉంటే 5 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇవ్వడం మీ అయ్య జాగీరా రేవంత్ రెడ్డి ? అంటూ ప్రశ్నించారు.
ఏపీకి పరిశ్రమలు
కేసీఆర్ హయాంలో తెచ్చిన టీఎస్ఐ పాస్‌తో పెట్టుబడులు వచ్చాయని నీతి ఆయోగ్ ప్రశంసించిందని గుర్తు చేశారు. రేవంత్ ఘనతతో పరిశ్రమలు ఏపీకి తరలిపోతున్నాయని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో అప్పుల గురించి రేవంత్ అవే అబద్దాలు చెబుతున్నారని, అప్పటి అప్పులు కేవలం మూడున్నర లక్షల కోట్ల రూపాయలు మాత్రమేనని.. కేసీఆర్ అప్పులు తెచ్చి ఆస్తులు సృష్టించారని.. రేవంత్ అప్పులు తెచ్చి ఏం చేశారు ? ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు లను తిడితే రాష్ట్రానికి పెట్టుబడులు రావని.. నీ తిట్లతో రాష్ట్రం ఖజానా నిండుతుంది అంటే రోజంతా తిట్టు అంటూ వ్యాఖ్యానించారు. ఎవరు ఎవర్ని బొంద పెట్టాలో దేవుడు నిర్ణయిస్తాడని.. రేవంత్ రెడ్డిని కొడంగల్‌లో బొంద పెట్టాలా? జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో బొంద పెట్టాలా అని మేము అనలేమా ? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌ను బొంద పెడతా అని అనడానికి నువ్వెవరురా రేవంత్ రెడ్డి ? అంటూ ఘాటుగా ప్రశ్నించారు.
ఇంత అధ్వాన్నంగా ఎవరూ మాట్లాడలేదు..
ఎందరో సీఎం లను ఎప్పట్నుంచో చూసినా రేవంత్ లా ఇంతటి అధ్వాన్నంగా మాట్లాడలేదన్నారు. కేటీఆర్ అమెరికాలో బాత్రూమ్ లు కడిగినాడు పదే పదే రేవంత్ రెడ్డి కూస్తున్నాడని.. గాంధీ సబర్మతి ఆశ్రమానికి వచ్చే వారికి బాత్రూంలు కడగాలని కండిషన్ పెట్టేవారని.. బాత్రూంలు కడిగే వారి ఔన్నత్యాన్ని కూడా రేవంత్ రెడ్డి కించపరుస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి ఏ అహంకారంతో ఇట్లా మాట్లాడున్నాడని.. రేవంత్ తిట్టే నిజాం కూడా తెలంగాణలో చాలానే మంచి పనులు చేశాడన్నారు. నిజాం చేసిన మంచి పనుల్లో నువ్వు ఒక్కటైనా చేశావా రేవంత్ రెడ్డి ? సన్న బియ్యం పండించడానికైనా.. కరెంటు బాగుండడానికైనా కేసీఆర్ కష్టమే కారణమన్నారు. రేవంత్ వచ్చాక చేసింది ఏమీ లేదని. అపుడు తెలంగాణ ద్రోహిగా మారినందుకే కదా శ్రీకాంత చారి లాంటి వాళ్లు అమరులయ్యారన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మారాలని.. సీఎం ననే సోయి తెచ్చుకోవాలంటూ హితవు పలికారు. ప్రెస్‌మీట్‌లో చిరుమల్ల రాకేశ్ కుమార్, ఉపేంద్రా చారి, అర్పిత ప్రకాశ్ పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!




