Dharmapuri Aravind | జీవన్ రెడ్డిని కూడా కేసీఆర్ మోసం చేశాడు : ధర్మపురి అరవింద్
Dharmapuri Aravind | ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరిన తాటిపర్తి జీవన్ రెడ్డిని కూడా మాజీ సీఎం కేసీఆర్ మోసం చేశాడని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Dharmapuri Aravind | త్రినేత్ర.న్యూస్ : ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరిన తాటిపర్తి జీవన్ రెడ్డిని కూడా మాజీ సీఎం కేసీఆర్ మోసం చేశాడని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మపురి అరవింద్ ఆదివారం మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్‌కు మెమోరీ లాస్ పెరిగిపోయింది. ఆయనకు కొద్దిగా మతి భ్రమిస్తుంది. జగిత్యాల పోయి జీవన్ రెడ్డిని జాయిన్ చేసుకుండు. పార్టీ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేను ఏమనలేదు. కానీ జీవన్ రెడ్డిని చేర్చుకున్నాడు. ఎమ్మెల్యేనేమో నేను పోలేదు అంటున్నాడు. పోకపోతే బీఆర్ఎస్ స్టేజీ మీద లేడు. కేసీఆరేమో ఎమ్మెల్యేను ఒక్క మాట అనలేదు. కానీ జీవన్ రెడ్డిని రేవంత్ రెడ్డి మస్తు తిట్టిండు. కేసీఆర్ ఎందుకు అనలేదు. అంటే సంజయ్ టచ్‌లో ఉన్నారా..? మళ్లీ జీవన్ రెడ్డి ఈ వయసులో అధోగతి పాలవుతారా..? కేసీఆర్ జీవన్ రెడ్డిని కూడా మోసం చేసిండు. జగిత్యాల ప్రజలు ఉన్నంత కన్ఫ్యూజన్‌లో రాష్ట్రంలో ఎవరూ లేరు అని ధర్మపురి అరవింద్ అన్నారు.
కేసీఆర్ శకం ముగిసింది. కేసీఆర్ గురించి తెలంగాణ ప్రజలు ఆలోచన చేసే ప్రసక్తే లేదు. హైలీ కరప్టడ్ పర్సన్, హైలీ కరప్టడ్ ఫ్యామిలీ.. మొత్తం తెలంగాణకు మత్తు పదార్థాలు.. గ్రామ స్థాయి నుంచి అలవాటు చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అన్ని తప్పులే. ఔటర్ రింగ్ రోడ్డు మెయింటెనెన్స్ పెద్ద స్కాం. కేసీఆర్ ఎన్ని చానళ్లకు ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా అది లేచేది లేదు. దీని కంటే డీప్‌గా కరప్షన్ గురించి మాట్లాడాలంటే ఆయన బిడ్డను అడిగితే చెప్తది అని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



