త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lava Bold 2 5G | లావా నుంచి బ‌డ్జెట్ ధ‌ర‌కే కొత్త 5జి స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

Lava Bold 2 5G | మొబైల్స్ తయారీదారు లావా నూత‌నంగా బోల్డ్ 2 5జి పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను భార‌త మార్కెట్‌లో లాంచ్ చేసింది. గ‌తేడాది విడుద‌లైన బోల్డ్ 5జి మోడ‌ల్ కు కొన‌సాగింపుగా ఈ ఫోన్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తుండ‌గా, ధ‌ర కూడా త‌క్కువగానే ఉంది.

S

Technology | Published On Mar 13, 2026, 5.03 pm IST

Lava Bold 2 5G | లావా నుంచి బ‌డ్జెట్ ధ‌ర‌కే కొత్త 5జి స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?
Advertisement

Lava Bold 2 5G | మొబైల్స్ తయారీదారు లావా నూత‌నంగా బోల్డ్ 2 5జి పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను భార‌త మార్కెట్‌లో లాంచ్ చేసింది. గ‌తేడాది విడుద‌లైన బోల్డ్ 5జి మోడ‌ల్ కు కొన‌సాగింపుగా ఈ ఫోన్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తుండ‌గా, ధ‌ర కూడా త‌క్కువగానే ఉంది. ఈ ఫోన్‌లో 6.67 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. తెర‌పై నాణ్య‌మైన దృశ్యాల‌ను వీక్షించ‌వ‌చ్చు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7060 ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. 6జీబీ వ‌ర‌కు ర్యామ్ ల‌భిస్తుంది. ర్యామ్‌ను అద‌నంగా మ‌రో 6జీబీ వ‌ర‌కు వ‌ర్చువ‌ల్‌గా పెంచుకునే వీలు క‌ల్పించారు. దీని వ‌ల్ల ఫోన్ ఎలాంటి ల్యాగ్ లేకుండా వేగంగా ప‌నిచేస్తుంది.

భారీ బ్యాట‌రీ..

ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 15 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను ఎలాంటి బ్లోట్‌వేర్ లేకుండా అందిస్తున్నామ‌ని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉండ‌గా, మ‌రో సెకండ‌రీ కెమెరాను ఇచ్చారు. ముందు వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఇచ్చారు. దీనికి 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ను ఇచ్చారు. అందువల్ల ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది. దీనికి ఐపీ64 డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. 128జీబీ స్టోరేజ్ సింగిల్ వేరియెంట్ ఆప్ష‌న్‌లోనే ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు.

ఇందులో డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. యూఎస్‌బీ టైప్ సి ఆడియోకు ఈ ఫోన్ స‌పోర్ట్ చేస్తుంది. 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్ సి క‌నెక్టివిటీ ఫీచ‌ర్ల‌ను అందించారు.

ధ‌ర వివ‌రాలు..

లావా బోల్డ్ 2 5జి స్మార్ట్ ఫోన్‌ను ఫెద‌ర్ వైట్‌, మిడ్‌నైట్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన సింగిల్ వేరియెంట్ 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.12,999గా ఉంది. మార్చి 19 నుంచి అమెజాన్‌లో ఈ ఫోన్‌ను విక్ర‌యించ‌నున్నారు.

Advertisement
Advertisement