త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

itel ACE 4 Shine | సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ప్ర‌త్యేక ఫీచ‌ర్ ఫోన్‌.. ధ‌ర కేవలం రూ.1059 మాత్ర‌మే..

itel ACE 4 Shine | ఐటెల్‌ సంస్థ భారత్‌లో కొత్త ఫీచర్‌ ఫోన్ ఐటెల్‌ ఏస్‌ 4 షైన్‌ను విడుదల చేసింది. రూ.1,500లోపు ధర విభాగంలో తీసుకొచ్చిన ఈ డ్యుయల్‌ సిమ్‌ ఫోన్‌ ప్రధానంగా సెకండరీ ఫోన్‌గా ఉపయోగించుకునేవారు, వృద్ధులు, తొలిసారి మొబైల్‌ ఫోన్‌ కొనుగోలు చేసేవారిని లక్ష్యంగా చేసుకుంది.

S

Technology | Published On Sep 25, 2026, 2.16 pm IST

itel ACE 4 Shine | సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ప్ర‌త్యేక ఫీచ‌ర్ ఫోన్‌.. ధ‌ర కేవలం రూ.1059 మాత్ర‌మే..
Advertisement

itel ACE 4 Shine | ఐటెల్‌ సంస్థ భారత్‌లో కొత్త ఫీచర్‌ ఫోన్ ఐటెల్‌ ఏస్‌ 4 షైన్‌ను విడుదల చేసింది. రూ.1,500లోపు ధర విభాగంలో తీసుకొచ్చిన ఈ డ్యుయల్‌ సిమ్‌ ఫోన్‌ ప్రధానంగా సెకండరీ ఫోన్‌గా ఉపయోగించుకునేవారు, వృద్ధులు, తొలిసారి మొబైల్‌ ఫోన్‌ కొనుగోలు చేసేవారిని లక్ష్యంగా చేసుకుంది. సాధారణ కనెక్టివిటీతో పాటు టైప్ సి ఛార్జింగ్‌ వంటి ఆధునిక సదుపాయాలను ఇందులో అందించారు. ఐటెల్‌ ఏస్‌ 4 షైన్ ను వంపులతో కూడిన బాడీ, టెక్స్చర్డ్‌ ఫినిష్‌తో రూపొందించారు. దీంతో ఫోన్‌ను పట్టుకోవడం సులభంగా ఉండడంతోపాటు మన్నిక కూడా మెరుగ్గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇందులో 1.77 ఇంచుల క్యూవీవీజీఏ కలర్‌ డిస్‌ప్లే ఉంది. ఇది 128 * 160 పిక్స‌ల్స్‌ రిజల్యూషన్‌ను అందిస్తుంది. బ్యాక్‌లిట్‌ రేడియంట్‌ కీప్యాడ్‌, పెద్ద అక్షరాలతో కూడిన డయలర్‌ ఉండడంతో తక్కువ వెలుతురులోనూ నంబర్లు, మెనూలను సులభంగా చూడవచ్చు. బ్లాక్‌, మ్యాజిక్‌ బ్లూ, ఫారెస్ట్‌ గ్రీన్‌ రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది.

8 రోజుల వ‌ర‌కు స్టాండ్ బై టైం..

ఫోన్‌లో 1,000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. నెట్‌వర్క్‌, వినియోగాన్ని బట్టి ఇది గరిష్ఠంగా 8 రోజుల స్టాండ్‌బై సమయాన్ని, 8.3 గంటల వరకు టాక్‌టైమ్‌ను అందిస్తుంది. ఈ ధర విభాగంలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశం టైప్ సి ఛార్జింగ్‌ పోర్ట్‌. దీంతో పాత మైక్రో యూఎస్‌బీ కేబుల్స్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. వృద్ధులు, యాక్సెసిబిలిటీ అవసరాలు ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని ఇటెల్‌ కింగ్‌ వాయిస్‌ ఫీచర్‌ను అందించింది. ఇది మెనూలు, వచ్చే కాల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో వాయిస్‌ ద్వారా వినిపిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు ఎస్‌ఓఎస్‌ ఫీచర్‌ కూడా ఉంది. భారతీయ భాషల పరంగా సిస్టమ్‌ ఇంటర్‌ఫేస్‌లో ఇంగ్లిష్‌, హిందీ, గుజరాతీ, తెలుగు, తమిళం, పంజాబీ, కన్నడ, మలయాళం, బెంగాలీ సహా మొత్తం 9 భాషలకు మద్దతు ఉంది. అలాగే 22 భారతీయ ప్రాంతీయ భాషల్లో టెక్స్ట్‌ను చూపించే బీఐఎస్ ధ్రువీకరించిన డిస్‌ప్లే సపోర్ట్‌ ఉంది.

ఇత‌ర ఫీచ‌ర్లు, ధ‌ర వివ‌రాలు..

ఐటెల్‌ ఏస్‌ 4 షైన్‌లో యూనిసోక్‌ ఎస్సీ6533జి ప్రాసెసర్‌, 4 ఎంబీ ర్యామ్‌, 8 ఎంబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉన్నాయి. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజీని 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఫోన్‌లో ఫొటో ట్యాగింగ్‌ సదుపాయంతో 500 కాంటాక్ట్స్‌ వరకు సేవ్‌ చేసుకోవచ్చు. కనెక్టివిటీ కోసం 900, 1800 మెగాహెడ్జ్ బ్యాండ్లలో డ్యుయల్‌ సిమ్ 2జి సపోర్ట్‌ ఉంది. వైర్‌లెస్‌ ఎఫ్‌ఎం రేడియోతోపాటు రికార్డింగ్‌ సదుపాయం, బిల్ట్ ఇన్‌ స్పీకర్‌, బ్లూటూత్‌, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌ ఉన్నాయి. ఆటోమేటిక్‌ కాల్‌ రికార్డింగ్‌, ప్రత్యేక వాయిస్‌ రికార్డర్‌ కూడా అందించారు. రోజువారీ అవసరాల కోసం ఎల్‌ఈడీ టార్చ్‌, మ్యూజిక్‌ ప్లేయర్‌, వీడియో ప్లేయర్‌, ఫైల్‌ మేనేజర్‌, క్యాలెండర్‌, అలారం, కాలిక్యులేటర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఐటెల్‌ ఏస్‌ 4 షైన్‌ ధరను రూ.1,059గా నిర్ణయించారు. ఐటెల్‌ ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ విక్రయ మార్గాల ద్వారా ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. కస్టమర్లకు కార్‌కేర్‌ సేవలతో పాటు దేశవ్యాప్తంగా 1,000కుపైగా సర్వీస్‌ సెంటర్లు, 1.3 లక్షలకు పైగా రిటైల్‌ టచ్‌పాయింట్లతో కూడిన సేవా వ్యవస్థను కంపెనీ అందిస్తోంది.

Advertisement
Advertisement