త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

itel A300C | రూ.10,999కే ఐటెల్ ఎ300సి ఫోన్‌.. 6000ఎంఏహెచ్ బ్యాటరీ..

itel A300C | చ‌వ‌క ధరలో అధిక‌ ఫీచర్లు క‌లిగిన‌ స్మార్ట్‌ఫోన్‌ను కోరుకునే వినియోగదారుల కోసం ఐటెల్ సంస్థ భారత మార్కెట్లో ఎ300సి మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఎ సిరీస్ లో భాగంగా వచ్చిన ఈ 4జి స్మార్ట్‌ఫోన్ ధరను రూ.10,999గా నిర్ణయించారు.

S

Technology | Published On Sep 21, 2026, 12.50 pm IST

itel A300C | రూ.10,999కే ఐటెల్ ఎ300సి ఫోన్‌.. 6000ఎంఏహెచ్ బ్యాటరీ..
Advertisement

itel A300C | చ‌వ‌క ధరలో అధిక‌ ఫీచర్లు క‌లిగిన‌ స్మార్ట్‌ఫోన్‌ను కోరుకునే వినియోగదారుల కోసం ఐటెల్ సంస్థ భారత మార్కెట్లో ఎ300సి మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఎ సిరీస్ లో భాగంగా వచ్చిన ఈ 4జి స్మార్ట్‌ఫోన్ ధరను రూ.10,999గా నిర్ణయించారు. బిల్ట్ ఫర్ రియల్ లైఫ్ అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ ఫోన్‌లో అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ, రోజువారీ మల్టీటాస్కింగ్‌కు సరిపడే పనితీరు, మన్నిక వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో 6.56 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ఇది 90హెడ్జ్‌ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్‌లో ఆక్టాకోర్ యూనిసాక్ టి7100 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ జత చేశారు. వర్చువల్ మెమరీ విస్తరణ ద్వారా మొత్తం 12జీబీ వరకు సమర్థవంతమైన ర్యామ్‌ను వినియోగించుకునే అవకాశం ఉంది. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 2టీబీ వరకు పెంచుకోవచ్చు.

మిలిట‌రీ గ్రేడ్ నాణ్య‌త‌..

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్‌పై పనిచేస్తుంది. చెల్లింపు యాప్‌లు, వీడియో స్ట్రీమింగ్, సోషల్ మెసేజింగ్ వంటి రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించారు. భద్రత కోసం పక్క భాగంలో ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తోపాటు ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కూడా అందించారు. మన్నిక విషయంలో ఐటెల్ ఎ300సికి మిలిటరీ గ్రేడ్ ప్రమాణాల ధ్రువీకరణ ఉంది. సాధారణంగా ఎదురయ్యే పడిపోవడం, దెబ్బలు వంటి పరిస్థితులను తట్టుకునేలా ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. కొనుగోలు చేసిన తేదీ నుంచి 100 రోజుల పాటు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ సదుపాయాన్ని కూడా కంపెనీ అందిస్తోంది. కెమెరాల విషయానికి వస్తే వెనుక భాగంలో ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన 8 మెగాపిక్స‌ల్ కెమెరా, ముందు భాగంలో 5 మెగాపిక్స‌ల్ కెమెరా ఉన్నాయి. ఆడియో కోసం డీటీఎస్ సౌండ్ సపోర్ట్ కలిగిన స్పీకర్లను అందించారు. 3.5ఎంఎం ఆడియో జాక్ కూడా ఉంది. ఇంట్లోని అనుకూల పరికరాలను నియంత్రించేందుకు ఇన్‌ఫ్రారెడ్ ట్రాన్స్‌మిటర్‌ను, ఇతర పరికరాలకు కనెక్ట్ చేసేందుకు యూఎస్‌బీ టైప్ సి ఓటీజీ సపోర్ట్‌ను అందించారు. అల్ట్రాలింక్ ఫ్రీ కాల్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

ధ‌ర వివ‌రాలు..

కనెక్టివిటీ పరంగా డ్యుయల్ సిమ్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 5, జీపీఎస్, గ్లోనాస్, బీడౌ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఫోన్‌లో 6000ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. ఇది 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఐటెల్ ఎ300సి ధర రూ.10,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫామ్‌లతోపాటు దేశవ్యాప్తంగా సాధారణ రిటైల్ దుకాణాల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. భారత్ లో 1.3 లక్షలకు పైగా రిటైల్ ఔట్‌లెట్లు, 1,000 సర్వీస్ సెంటర్ల నెట్‌వర్క్ ద్వారా విక్రయాలు, సేవలను అందిస్తున్నట్లు ఐటెల్ తెలిపింది.

Advertisement
Advertisement