త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tata Sierra | టాటా సియెర్రా ఎస్‌యూవీకి ఫుల్ డిమాండ్‌.. 24 గంట‌ల్లోనే 70వేల బుకింగ్స్‌..

ప్ర‌ముఖ కార్ల త‌యారీదారు టాటా మోటార్స్ ఇటీవ‌లే త‌న నూత‌న ఎస్‌యూవీ మోడ‌ల్ టాటా సియెర్రాను (Tata Sierra) మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే ఈ కారుకు వినియోగ‌దారుల నుంచి భారీ ఎత్తున స్పంద‌న ల‌భిస్తోంది.

S

Technology | Published On Dec 19, 2025, 5.39 pm IST

Tata Sierra  | టాటా సియెర్రా ఎస్‌యూవీకి ఫుల్ డిమాండ్‌.. 24 గంట‌ల్లోనే 70వేల బుకింగ్స్‌..
Advertisement

Tata Sierra | ప్ర‌ముఖ కార్ల త‌యారీదారు టాటా మోటార్స్ ఇటీవ‌లే త‌న నూత‌న ఎస్‌యూవీ మోడ‌ల్ టాటా సియెర్రాను మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే ఈ కారుకు వినియోగ‌దారుల నుంచి భారీ ఎత్తున స్పంద‌న ల‌భిస్తోంది. ఈ కారును బుక్ చేసుకునేందుకు క‌స్ట‌మ‌ర్లు పోటీ ప‌డుతున్నారు. దేశంలోని దాదాపు అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఇప్ప‌టికే ఈ కారును టెస్ట్ డ్రైవ్ చేసేందుకు అందుబాటులో ఉంచారు. ఈ క్ర‌మంలోనే సియెర్రా కారును డ్రైవ్ చేస్తున్న క‌స్ట‌మ‌ర్లు చ‌క్క‌ని ఎక్స్‌పీరియెన్స్‌ను పొందుతున్నారు. ఈ కారు వినియోగ‌దారుల‌కు అన్ని విధాలుగా న‌చ్చింద‌ని, అందుక‌నే ఫుల్ డిమాండ్ ఏర్ప‌డింద‌ని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్ర‌స్తుతానికి ఈ కారుకు బుకింగ్స్ ప్రారంభం కాగా జ‌న‌వ‌రి 15 నుంచి డెలివరీ ఇవ్వ‌నున్నారు. కాగా ఈ కారు లాంచ్ అయిన తొలి రోజే మొద‌టి 24 గంట‌ల్లో ఏకంగా 70వేల బుకింగ్స్ వ‌చ్చిన‌ట్లు టాటా ప్ర‌తినిధులు తెలిపారు. మ‌రో 1.35 ల‌క్ష‌ల మంది కారును బుక్ చేసేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్లు తెలిపారు.

టాటా సియెర్రా కారు వాస్త‌వానికి రిలీజ్ కాకముందే చ‌క్క‌ని ఆక‌ర్ష‌ణ పొందింది. వినియోగ‌దారులు ఈ కారు రిలీజ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఈ క్ర‌మంలోనే రిలీజ్ అయిన కొన్ని గంట‌ల్లోనే భారీ ఎత్తున ఆర్డ‌ర్లు వ‌చ్చాయి. ఎస్‌యూవీ మార్కెట్‌లో ఈ కారు గురించే ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా చ‌ర్చ న‌డుస్తోంది. టాటా సియెర్రా కారును బాక్స్ షేప్‌తో ఆక‌ర్ష‌ణీయంగా డిజైన్ చేశారు. ఇందులో ప‌లు భిన్న ర‌కాల మోడ్ర‌న్ ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ప్రీమియం లుక్ వ‌చ్చేలా గ్లాక్‌-బ్లాక్ డిజైన్ల‌ను ఈ కార్ క‌లిగి ఉంది. ఎల్ఈడీ హెడ్‌లైట్ల‌ను ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించేలా తీర్చిదిద్దారు. కారు లోప‌ల ప్రీమియం ఇంటీరియ‌ర్‌ను అందిస్తున్నారు. మూడు డ్యాష్ బోర్డు డిస్‌ప్లేలు ఉంటాయి. ఒక‌టి డ్రైవ‌ర్ కోసం కాగా రెండు ఇన్ఫోటెయిన్‌మెంట్ కోసం ఏర్పాటు చేయ‌బ‌డ్డాయి. దీని వ‌ల్ల కంటెంట్ ను చాలా సుల‌భంగా షేర్ చేసుకోవ‌చ్చు.

ఈ కార్‌లో ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంది. దీనికి ట‌చ్ సెన్సిటివ్ కంట్రోల్స్‌ను ఇచ్చారు. అలాగే 12 స్పీక‌ర్ జేబీఎల్ ఆడియో సిస్ట‌మ్‌ను ఈ కారులో ఇచ్చారు. సోనిక్ షాఫ్ట్ సౌండ్‌బార్ కూడా ఉంది. డ్యుయ‌ల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఫీచ‌ర్‌ను ఇచ్చారు. ప‌నోర‌మిక్ స‌న్‌రూఫ్ కూడా పెద్ద‌గా ఉంటుంది. వైర్‌లెస్ చార్జింగ్ డాక్ ల‌భిస్తుంది. ఇక సీట్ల‌ను కూడా చాలా సౌక‌ర్య‌వంతంగా ఉండేలా ల‌గ్జ‌రీ మెటీరియ‌ల్‌తో తీర్చిదిద్దారు. ఈ కారు పెట్రోల్‌, డీజిల్‌, ట‌ర్బో పెట్రోల్ వేరియెంట్ల‌లో అందుబాటులో ఉంది. వీటిల్లో 6 స్పీడ్‌, 7 స్పీడ్ గేర్ బాక్స్ ఆప్ష‌న్లు ఉన్నాయి. బేసిక్ మోడ‌ల్‌కు చెందిన ఎక్స్ షోరూం ధ‌ర రూ.11.49 ల‌క్ష‌లుగా ఉంది. దీన్ని స్మార్ట్ ప్ల‌స్ మోడ‌ల్‌గా లాంచ్ చేశారు. ఇక టాప్ ఎండ్ మోడ‌ల్ అకాంప్లిష్డ్ ప్ల‌స్ ఎక్స్ షోరూం ధ‌ర రూ.19.99 ల‌క్ష‌లుగా ఉంది.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement