Ducati Desmo450 MX | భారత మార్కెట్‌లో లాంచ్ అయిన డుకాటి తొలి డర్ట్ బైక్.. ధర ఎంతంటే..?
Ducati Desmo450 MX | డుకాటి సంస్థ భారత ఆఫ్-రోడ్ మోటార్‌సైకిల్ విభాగంలో అధికారికంగా ప్రవేశించింది. కంపెనీ తన కొత్త మోటోక్రాస్ బైక్ డెస్మో450 ఎమ్‌ఎక్స్ (Desmo450 MX)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.17.24 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
Technology | Published On Mar 16, 2026, 3.26 pm IST
Ducati Desmo450 MX | డుకాటి సంస్థ భారత ఆఫ్-రోడ్ మోటార్‌సైకిల్ విభాగంలో అధికారికంగా ప్రవేశించింది. కంపెనీ తన కొత్త మోటోక్రాస్ బైక్ డెస్మో450 ఎమ్‌ఎక్స్ (Desmo450 MX)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.17.24 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ మోటోక్రాస్ యంత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దాదాపు ఏడాది తర్వాత భారత్‌కు వచ్చింది. ఇటాలియన్ తయారీదారైన డుకాటి భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొదటి డర్ట్ బైక్ ఇదే కావడం విశేషం. పోటీ ఆఫ్-రోడ్ రైడింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ బైక్ తక్కువ బరువు నిర్మాణం, ఆధునిక ఎలక్ట్రానిక్స్, డుకాటి ప్రత్యేకమైన డెస్మోడ్రోమిక్ ఇంజిన్ టెక్నాలజీ కలయికతో లాంచ్ అయింది.
తక్కువ బరువు, దృఢమైన నిర్మాణం..
డుకాటి డెస్మో450 ఎమ్‌ఎక్స్ ను పూర్తిగా మోటోక్రాస్ పనితీరును దృష్టిలో పెట్టుకుని రూపకల్పన చేశారు. ఈ బైక్‌లో సరళమైన రేసింగ్‌కు అనుకూలమైన డిజైన్ ను ఇచ్చారు. తేలికపాటి అల్యూమినియం పెరిమీటర్ ఫ్రేమ్ ఆధారంగా నిర్మించిన ఈ బైక్ చాసిస్‌లో వెల్డింగ్ పాయింట్లు తక్కువగా ఉంచారు. దీంతో నిర్మాణ బలం పెరగడంతోపాటు మొత్తం బరువు తగ్గింది. ఈ బైక్ వెట్ వెయిట్ (ఇంధనం లేకుండా) 104.8 కిలోలుగా ఉంది. దీంతో ఆఫ్-రోడ్ రైడింగ్‌కు ఇది అత్యంత చురుకైనదిగా ఉంటుంది. ఇది పూర్తిగా మోటోక్రాస్ కోసం రూపొందించబడిన బైక్ కావడంతో హెడ్‌లైట్లు, మిర్రర్లు లేదా ఇండికేటర్లు వంటి రోడ్ వినియోగానికి అవసరమైన పరికరాలు ఇందులో లేవు. దీంతో ఇది రోజువారీ రోడ్డు ప్రయాణం కంటే ట్రాక్, మట్టి మార్గాల్లో రైడింగ్ కోసం రూపొందించబడిందని స్పష్టమవుతోంది.
449.6 సీసీ ఇంజిన్..
ఈ మోటార్‌సైకిల్‌లో 449.6 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఇందులో డుకాటి ప్రసిద్ధి చెందిన డెస్మోడ్రోమిక్ వాల్వ్ సిస్టమ్ ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 63.5 హెచ్‌పీ శక్తిని, 53.5 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ గరిష్ఠ ఆర్‌పీఎమ్ పరిమితి 11,900 వరకు ఉంటుంది. డుకాటి ప్రకారం ఈ ఇంజిన్ ను విస్తృత పవర్‌బ్యాండ్‌ను అందించేలా ట్యూన్ చేశారు. తక్కువ, మధ్యస్థ ఆర్‌పీఎమ్‌ల వద్ద బలమైన టార్క్ అందించడంతోపాటు ఎక్కువ వేగాల్లో కూడా మంచి పనితీరును కొనసాగించేలా రూపొందించారు.
వైఫై కనెక్టివిటీ..
ఈ మోటార్‌సైకిల్‌లో లాంచ్ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, రెండు రైడింగ్ మోడ్‌లు కూడా ఉన్నాయి. డుకాటి ఎక్స్-లింక్ యాప్ ద్వారా వైఫై కనెక్టివిటీ సహాయంతో రైడర్లు వివిధ సెట్టింగ్‌లను తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు. వేర్వేరు రైడింగ్ పరిస్థితులకు లేదా వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా బైక్‌ను సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. భారత్‌లో డుకాటి డెస్మో450 ఎమ్‌ఎక్స్ ధర రూ.17.24 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ బైక్ కోసం బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు ఈ నెల చివరి వరకు ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు




