Acer | ఏసర్ నుంచి అత్యంత చవక ధరకే ఏఐ ల్యాప్టాప్లు.. ధర రూ.40వేలే..
Acer | భారత మార్కెట్లో ఏసర్ తన ల్యాప్టాప్ పోర్ట్ఫోలియోను మరింత విస్తరించింది. ఢిల్లీలో నిర్వహించిన నెక్స్ట్ఎట్ ఏసర్ ఇండియా కార్యక్రమంలో నైట్రో, ప్రిడేటర్, ఆస్పైర్, స్విఫ్ట్ సిరీస్లలో కొత్త ల్యాప్టాప్లను కంపెనీ విడుదల చేసింది. ఈ కొత్త లైనప్లో నైట్రో 5, నైట్రో 5 ప్రొ, ప్రిడేటర్ హీలియోస్ నియో 16ఎస్ ఏఐ, ప్రిడేటర్ హీలియోస్ నియో 16 ఏఐ, ప్రిడేటర్ హీలియోస్ నియో 16, ఆస్పైర్ 3, స్విఫ్ట్ ప్రొ, ఆస్పైర్ ప్రొ ఏఐ మోడళ్లు ఉన్నాయి.
Technology | Published On Aug 11, 2026, 3.23 pm IST
Acer | భారత మార్కెట్లో ఏసర్ తన ల్యాప్టాప్ పోర్ట్ఫోలియోను మరింత విస్తరించింది. ఢిల్లీలో నిర్వహించిన నెక్స్ట్ఎట్ ఏసర్ ఇండియా కార్యక్రమంలో నైట్రో, ప్రిడేటర్, ఆస్పైర్, స్విఫ్ట్ సిరీస్లలో కొత్త ల్యాప్టాప్లను కంపెనీ విడుదల చేసింది. ఈ కొత్త లైనప్లో నైట్రో 5, నైట్రో 5 ప్రొ, ప్రిడేటర్ హీలియోస్ నియో 16ఎస్ ఏఐ, ప్రిడేటర్ హీలియోస్ నియో 16 ఏఐ, ప్రిడేటర్ హీలియోస్ నియో 16, ఆస్పైర్ 3, స్విఫ్ట్ ప్రొ, ఆస్పైర్ ప్రొ ఏఐ మోడళ్లు ఉన్నాయి. ఏసర్ నైట్రో 5, నైట్రో 5 ప్రొ గేమింగ్ ల్యాప్టాప్లు ఇంటెల్ కోర్ 14వ జనరేషన్ హెచ్ఎక్స్ ప్రాసెసర్లతో వస్తాయి. కాన్ఫిగరేషన్ను బట్టి ఎన్విడియా జిఫోర్స్ ఆర్టీఎక్స్ 40 సిరీస్, ఆర్టీఎక్స్ 50 సిరీస్ ల్యాప్టాప్ జీపీయూలను ఇందులో ఎంచుకోవచ్చు. ఈ రెండు మోడళ్లలో 16 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 1920 * 1200 రిజల్యూషన్, గరిష్ఠంగా 165 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. అలాగే గరిష్ఠంగా 32జీబీ ర్యామ్, 2టీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ను పొందవచ్చు.
నైట్రో 5, నైట్రో 5 ప్రొ..
నైట్రో 5లో గరిష్ఠంగా ఇంటెల్ కోర్ ఐ7-14650హెచ్ఎక్స్ ప్రాసెసర్, ఎన్విడియా జిఫోర్స్ ఆర్టీఎక్స్ 4050 లేదా ఆర్టీఎక్స్ 5050 ల్యాప్టాప్ జీపీయూలను ఎంచుకోవచ్చు. ఆర్టీఎక్స్ 4050 వేరియంట్ హెరాల్డ్ గ్రే రంగులో 62 వాట్అవర్ బ్యాటరీ, నాహిమిక్ ఆడియోతో వస్తుంది. ఆర్టీఎక్స్ 5050 వేరియంట్ బ్లాక్ రంగులో 73 వాట్అవర్ బ్యాటరీ, సౌండ్ బ్లాస్టర్ స్టూడియో ప్లస్ ఆడియోతో లభిస్తుంది. నైట్రో 5ప్రొ కూడా ఆర్టీఎక్స్ 4050, ఆర్టీఎక్స్ 5050 జీపీయూ ఎంపికలతో అందుబాటులో ఉంది. ఏసర్ ప్రిడేటర్ హీలియోస్ నియో 16ఎస్ ఏఐ, ప్రిడేటర్ హీలియోస్ నియో 16 ఏఐ, ప్రిడేటర్ హీలియోస్ నియో 16 పేర్లతో మూడు కొత్త గేమింగ్ ల్యాప్టాప్లను విడుదల చేసింది. ప్రిడేటర్ హీలియోస్ నియో 16ఎస్ ఏఐ మెటల్ ఛాసిస్తో వస్తుంది. ఇందులో గరిష్ఠంగా ఇంటెల్ కోర్ అల్ట్రా 7 356హెచ్ ప్రాసెసర్, ఎన్విడియా జిఫోర్స్ ఆర్టీఎక్స్ 5060 ల్యాప్టాప్ జీపీయూ ఉన్నాయి.
ప్రిడేటర్ హీలియోస్ సిరీస్..
ప్రిడేటర్ హీలియోస్ నియో 16 ఏఐలో గరిష్ఠంగా ఇంటెల్ కోర్ అల్ట్రా 9 290హెచ్ఎక్స్ ప్రాసెసర్, ఎన్విడియా జిఫోర్స్ ఆర్టీఎక్స్ 5080 ల్యాప్టాప్ జీపీయూ ఉన్నాయి. ఇందులో 16జీబీ వరకు వీడియో మెమరీ లభిస్తుంది. ప్రిడేటర్ హీలియోస్ నియో 16లో గరిష్ఠంగా ఇంటెల్ కోర్ ఐ9-14900హెచ్ఎక్స్ ప్రాసెసర్, ఎన్విడియా జిఫోర్స్ ఆర్టీఎక్స్ 5070 ల్యాప్టాప్ జీపీయూ ఉన్నాయి. ఇందులో 16 ఇంచుల డిస్ప్లే, 180 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 32జీబీ ర్యామ్, 2టీబీ ఎస్ఎస్డీ ఉన్నాయి. ఐదో తరం ప్రిడేటర్ ఏరోబ్లేడ్ కూలింగ్, వెక్టర్ హీట్ పైపులు, కిల్లర్ డబుల్షాట్ ప్రొ కనెక్టివిటీ, థండర్బోల్ట్ 4 సపోర్ట్ కూడా ఉన్నాయి.
ఏసర్ ఆస్పైర్ 3..
ఏసర్ ఆస్పైర్ 3లో ఏఎండీ రైజెన్ ప్రాసెసర్లు ఉన్నాయి. 15.6 ఇంచుల ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, ఏసర్ కంఫీవ్యూ టెక్నాలజీ, 180 డిగ్రీల వరకు పూర్తిగా ఫ్లాట్గా తెరుచుకునే హింజ్ ఉన్నాయి. ఇందులో గరిష్ఠంగా 16జీబీ ర్యామ్ను 32జీబీ వరకు విస్తరించుకోవచ్చు. పీసీఐఈ ఎన్వీఎంఈ ఎస్ఎస్డీ స్టోరేజ్ను 1టీబీ వరకు పెంచుకోవచ్చు. ఏసర్ స్విఫ్ట్ ప్రొలో ఇంటెల్ కోర్ అల్ట్రా 5, అల్ట్రా 7 హెచ్-సిరీస్ ప్రాసెసర్లు, ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ ఉన్నాయి. ఇందులో 14 ఇంచుల డిస్ప్లే, 400 నిట్స్ వరకు బ్రైట్నెస్ ఉన్నాయి. గరిష్ఠంగా 32జీబీ ర్యామ్, 1టీబీ ఎస్ఎస్డీ ఉన్నాయి. 52 వాట్అవర్ బ్యాటరీ గరిష్ఠంగా 10.5 గంటల బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. ఏసర్ ఆస్పైర్ ప్రొ ఏఐలో ఇంటెల్ కోర్ అల్ట్రా 5 125హెచ్ ప్రాసెసర్, విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఇందులో ప్రత్యేకమైన కోపైలట్ కీ, ఏసర్ కంఫీవ్యూ టెక్నాలజీతో 14 ఇంచుల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉన్నాయి. 16జీబీ ర్యామ్ను 32జీబీ వరకు, 512జీబీ ఎస్ఎస్డీని 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ గరిష్ఠంగా 10 గంటల వరకు ఉంటుంది.
ధర వివరాలు..
ఏసర్ నైట్రో 5, నైట్రో 5 ప్రొ ప్రారంభ ధరను రూ.1,67,990గా నిర్ణయించారు. వీటిపై రూ.10వేల వరకు క్యాష్బ్యాక్ లభిస్తుంది. ఏసర్ ఎక్స్క్లూజివ్ స్టోర్లు, ఏసర్ ఈ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. ప్రిడేటర్ హీలియోస్ నియో 16ఎస్ ఏఐ ధరను రూ.2,62,990గా, ప్రిడేటర్ హీలియోస్ నియో 16 ఏఐ ధరను రూ.2,82,990గా నిర్ణయించారు. ప్రిడేటర్ హీలియోస్ నియో 16 ధర రూ.2,42,990గా ఉంది. ఈ మూడు మోడళ్లపై రూ.10వేల వరకు క్యాష్బ్యాక్ అందిస్తున్నారు. ఏసర్ ఎక్స్క్లూజివ్ స్టోర్లు, ఏసర్ ఈ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, క్రోమా, రిలయన్స్, విజయ్ సేల్స్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఏసర్ ఆస్పైర్ 3 ప్రారంభ ధర రూ.39,999గా ఉంది. ఇది ఆర్3 3200యు సిరీస్ వేరియంట్కు వర్తిస్తుంది. ఏసర్ స్విఫ్ట్ ప్రొ ప్రారంభ ధర రూ.79,999గా ఉంది. ఏసర్ ఆస్పైర్ ప్రొ ఏఐ ప్రారంభ ధర రూ.69,999గా ఉంది.
తాజావార్తలు
- ●KTR | అర్హుల ఓట్లు తొలగించారు! : కేటీఆర్
- ●Ramchander Rao | ఖార్ఖానా ఖరీదైన అర్బన్ ప్రాంతం.. పరిహారం పెంచాల్సిందే : ఎన్ రాంచందర్ రావు
- ●NEET | నీట్ను రద్దు చేయాలి.. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన విజయ్ సర్కార్
- ●Wamiqa Gabbi | హనుమాన్ సీక్వెల్లో లోకేష్ కనగరాజ్ హీరోయిన్ - పదకొండేళ్ల తర్వాత తెలుగు సినిమాలో ఛాన్స్!
- ●Telangana Voters | తెలంగాణ ఓటర్లు మొత్తం 2,64,87,214 మంది
- ●Harish Rao | రైతులు ఎదురు చూస్తున్నరు.. రిజర్వాయర్లకు 30 టీఎంసీల నీటిని వెంటనే ఎత్తిపోయండి

KTR | అర్హుల ఓట్లు తొలగించారు! : కేటీఆర్

Ramchander Rao | ఖార్ఖానా ఖరీదైన అర్బన్ ప్రాంతం.. పరిహారం పెంచాల్సిందే : ఎన్ రాంచందర్ రావు

NEET | నీట్ను రద్దు చేయాలి.. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన విజయ్ సర్కార్

Wamiqa Gabbi | హనుమాన్ సీక్వెల్లో లోకేష్ కనగరాజ్ హీరోయిన్ - పదకొండేళ్ల తర్వాత తెలుగు సినిమాలో ఛాన్స్!



