Hockey World Cup | అత్యంత వైభవంగా హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ -2026 పోరు ప్రారంభం
Hockey World Cup | భాగ్యనగరం మరో అంతర్జాతీయ క్రీడా వేదికకు సాక్ష్యంగా నిలిచింది. గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ‘మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్–2026’ పోరు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
Hockey World Cup | త్రినేత్ర.న్యూస్ : భాగ్యనగరం మరో అంతర్జాతీయ క్రీడా వేదికకు సాక్ష్యంగా నిలిచింది. గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ‘మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్–2026’ పోరు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్‌లో ఎనిమిది దేశాల జట్లు పోటీపడుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో క్రీడా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ముఖ్య అతిథిగా సైబరాబాద్ సీపీ
తొలిరోజు మ్యాచ్‌లకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి పోటీలు నగరంలో నిర్వహించడం యువ క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. మ్యాచ్‌లకు సంబంధించి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్, ఎండీ డాక్టర్ ఏ సోనిబాలా దేవి కూడా పాల్గొన్నారు.
మైదానంలో హోరాహోరీ..
మొత్తం ఎనిమిది జట్లు రెండు పూల్‌లుగా విడిపోయి లీగ్ దశలో తలపడుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 12:45 గంటలకు ఇంగ్లాండ్–ఇటలీ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమైంది. అనంతరం కొరియా–ఆస్ట్రియా, స్కాట్లాండ్–వేల్స్ జట్లు పోటీ పడ్డాయి. రాత్రి 7:30 గంటలకు జరిగే భారత్–ఉరుగ్వే మ్యాచ్‌పై అభిమానుల దృష్టి కేంద్రీకృతమైంది. స్వదేశీ గడ్డపై భారత మహిళల జట్టు బోణీ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.
టోర్నీ షెడ్యూల్ ఇలా..
పూల్ - ఏ : ఇంగ్లాండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా
పూల్ - బీ : భారత్, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్
లీగ్ మ్యాచ్‌లు : మార్చి 8, 9, 11 తేదీల్లో జరుగుతాయి.
నాకౌట్ పోరు: మార్చి 13న సెమీ ఫైనల్స్, మార్చి 14న రాత్రి 7:30 గంటలకు ఫైనల్ మ్యాచ్.
విశ్రాంతి: మార్చి 10, 12 తేదీల్లో జట్లకు విశ్రాంతి.
అతిథులకు తెలంగాణ ఆతిథ్యం
స్టేడియంలో అత్యాధునిక ఆస్ట్రో టర్ఫ్, హై-ప్రొఫైల్ భద్రతతో పాటు విదేశీ క్రీడాకారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్రీడాకారులకు తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసేలా వారసత్వ కట్టడాల సందర్శన (హెరిటేజ్ టూర్లు) కూడా షెడ్యూల్‌లో చేర్చారు.
2026 మహిళల హాకీ వరల్డ్ కప్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ టోర్నీలో రాణించిన జట్లు నేరుగా వరల్డ్ కప్‌కు అర్హత సాధించనున్నాయి. హైదరాబాద్ మరోసారి ప్రపంచ క్రీడా పటంలో మెరిసిపోతోంది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



