త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | ముత్తయ్య మురళీధరన్‌ బౌలింగ్‌.. సిక్సర్‌ కొట్టిన సంజు శాంసన్‌..! Video

IPL 2026 | ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) తమ అభిమానుల కోసం ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈవెంట్‌ను నిర్వహించింది. ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు ఈ ఈవెంట్‌లో పాల్గొని మైదాన్ని క్రికెట్‌ పండగ వాతావరణంగా మార్చేశారు. ఈ కార్యక్రమంలో ఓ స్పెషల్‌ ఆన్‌ఫీల్డ్‌ మ్యాచ్‌ జరిగింది.

P

Sports | Published On Mar 23, 2026, 11.44 am IST

IPL 2026 | ముత్తయ్య మురళీధరన్‌ బౌలింగ్‌.. సిక్సర్‌ కొట్టిన సంజు శాంసన్‌..! Video
Advertisement

IPL 2026 | ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) తమ అభిమానుల కోసం ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈవెంట్‌ను నిర్వహించింది. ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు ఈ ఈవెంట్‌లో పాల్గొని మైదాన్ని క్రికెట్‌ పండగ వాతావరణంగా మార్చేశారు. ఈ కార్యక్రమంలో ఓ స్పెషల్‌ ఆన్‌ఫీల్డ్‌ మ్యాచ్‌ జరిగింది. టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ కం వికెట్‌ కీపర్‌ శ్రీలంకకు చెందిన దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. మహేంద్ర సింగ్‌ ధోనీ కీపింగ్‌ చేయడం విశేషం.

తొలుత సంజు శాంసన్‌ జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశాడు. భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించిన శాంసన్‌ను మురళీధరన్‌ తన స్పిన్‌ మాయాజాలయంతో బోల్తాకొట్టించే ప్రయత్నం చేశాడు. అయితే, శాంసన్‌ను స్టంప్‌ అవుట్‌ చేసే అవకాశం రాగా.. అతనికి ఛాన్స్‌ ఇచ్చాడు. ఆ తర్వాత అందరూ నవ్వుతూ ఉండడం కనిపించింది. చివరలో శాంసన్‌ భారీ సిక్సర్‌ కొట్టడంతో చెపాక్‌ స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్‌ కేకలతో దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో టీ20 ప్రపంచకప్‌లో పాల్గొన్న సంజు శాంసన్‌, శివం దూబోతో పాటు అండర్‌-19 కెప్టెన్‌ ఆయూష్‌ మాత్రేలకు జ్ఞాపికలను అందజేశాడు. ఇదిలా ఉండగా.. ఈ సారి ఐపీఎల్‌ సీజన్‌లో సత్తాచాటాలని సీఎస్‌కే భావిస్తోంది. ఆరోసారి టైటిల్‌ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తొలి మ్యాచ్‌ను మార్చి 30న రాజస్థాన్‌ రాయల్స్‌లో తలపడనుంది.

https://x.com/SanjuSamsonFP/status/2035725598027604167

Advertisement

తాజావార్తలు

Advertisement