త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ranji Trophy | రంజీ ఫైన‌ల్లో హైటెన్ష‌న్‌.. క‌ర్నాట‌క ఆట‌గాడిని హెల్మెట్‌తో ఢీకొట్టిన జ‌మ్మూ కెప్టెన్‌..!

Ranji Trophy | క‌ర్నాట‌క‌, జ‌మ్మూ క‌శ్మీర్ మ‌ధ్య జ‌రుగుతున్న రంజీ ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఒక్క‌సారిగా ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నాయి. మ్యాచ్ రెండో రోజు ఫీల్డింగ్ చేస్తున్న క‌ర్నాట‌క ఆటగాడు కేవీ అనీష్‌ను జ‌మ్మూ క‌శ్మీర్ కెప్టెన్ పరాస్ డోగ్రా హెల్మెట్‌తో నెట్ట‌డం ఒక్క‌సారిగా మైదానంలో వాతావ‌ర‌ణాన్ని వేడెక్కించింది. చివ‌ర‌కు అంపైర్లు క‌లుగ‌జేసుకోవ‌డం గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది.

P

Sports | Published On Feb 25, 2026, 7.02 pm IST

Ranji Trophy | రంజీ ఫైన‌ల్లో హైటెన్ష‌న్‌.. క‌ర్నాట‌క ఆట‌గాడిని హెల్మెట్‌తో ఢీకొట్టిన జ‌మ్మూ కెప్టెన్‌..!
Advertisement

Ranji Trophy | క‌ర్నాట‌క‌, జ‌మ్మూ క‌శ్మీర్ మ‌ధ్య జ‌రుగుతున్న రంజీ ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఒక్క‌సారిగా ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నాయి. మ్యాచ్ రెండో రోజు ఫీల్డింగ్ చేస్తున్న క‌ర్నాట‌క ఆటగాడు కేవీ అనీష్‌ను జ‌మ్మూ క‌శ్మీర్ కెప్టెన్ పరాస్ డోగ్రా హెల్మెట్‌తో నెట్ట‌డం ఒక్క‌సారిగా మైదానంలో వాతావ‌ర‌ణాన్ని వేడెక్కించింది. చివ‌ర‌కు అంపైర్లు క‌లుగ‌జేసుకోవ‌డం గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. ఈ ఘ‌ట‌న 2025-26 రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రెండో రోజున జరిగింది. జ‌మ్మూ క‌శ్మీర్ కెప్టెన్ పరాస్ డోగ్రా సహనం కోల్పోయి క‌ర్నాట‌క ఫీల్డర్‌తో ఘర్షణకు దిగడం షాక్‌కు గురి చేసింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో డోగ్రా బౌండరీ కొట్టాడు. బంతి అతని బ్యాట్ బయటి అంచుకు తాకింది. బంతి స్లిప్ ఫీల్డర్‌ని దాటి బౌండ‌రీ లైన్ దాటింది. ఆ త‌ర్వాత స్ట్రైకర్ ఎండ్‌లోని ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. స్టంప్స్ మైక్‌లో కొన్ని మాట‌లు సైతం వినిపించాయి. డోగ్రా, క‌ర్నాట‌క ఫీల్డర్ కేవీ అనిష్ మధ్య గొడవకు దారితీసింది.

ఈ సమయంలో పరాస్ అనిష్ తలపై హెల్మెట్‌తో నెట్టాడు. అంపైర్ జోక్యం చేసుకునేలోపే.. క‌ర్నాట‌క సీనియర్ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్ ఇద్దరు ఆటగాళ్ల మధ్యకు వచ్చి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. డోగ్రాపై సీరియస్ అయ్యాడు. అంపైర్లు ఉల్హాస్ గాంధే, రోహన్ పండిట్ సైతం గొడవ పెద్దది కాకుండా ఆటగాళ్లను వేరు చేశారు. క‌ర్నాట‌క కెప్టెన్‌ దేవదత్ పడిక్కల్ ఈ ఘటనను మ్యాచ్‌ రిఫరికి నివేదించాడు. అయితే జమ్మూ ఆటగాళ్లు డోగ్రా, కన్హయ్య క‌ర్నాట‌క ఆటగాళ్లతో చాలాసార్లు వాగ్వాదానికి దిగారు. స్లెడ్జింగ్‌కు దిగ‌డం వ‌ల్లే కోపంతో డోగ్రా అలా ప్ర‌వ‌ర్తించిన‌ట్లుగా భావిస్తున్నారు. ఘ‌ట‌న త‌ర్వాత డోగ్రా క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. అయితే, దానికి క‌ర్నాట‌క ప్లేయ‌ర్ అంగీక‌రించేందుకు నిరాక‌రించాడు.

Advertisement
Advertisement