RTC Appointed Date | అపాయింటెడ్ డేట్ ను వెంటనే ప్రకటించాలి: ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ అల్టీమేటం
INTUC-RTC JAC: ఆర్. టి. సి ఉద్యోగులను ప్రభుత్వంలో వెంటనే విలీనం చేసి అపాయింటెడ్ డేట్(Appointed date) ను వెంటనే ప్రకటించాలని INTUC -ఆర్టీసీ జేఏసీ (RTC JAC) నేతలు డిమాండ్ చేశారు.
INTUC-RTC JAC: త్రినేత్ర.న్యూస్: ఆర్. టి. సి ఉద్యోగులను ప్రభుత్వంలో వెంటనే విలీనం చేసి అపాయింటెడ్ డేట్(Appointed date) ను వెంటనే ప్రకటించాలని INTUC -ఆర్టీసీ జేఏసీ (RTC JAC) నేతలు డిమాండ్ చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. కార్మికులలో ఉన్న అసంతృప్తిని తొలగించి, పారిశ్రామిక శాంతిని నెలకొల్పాలని కోరారు. ఈ మేరకు వారు డిమాండ్లతో కూడిన మెమోరాండం విడుదల చేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
ప్రభుత్వం పరిష్కరించాల్సిన డిమాండ్లివే..
1) ఆర్.టి.సి ఉద్యోగులను ప్రభుత్వంలో వెంటనే విలీనం చేసి అపాయింటెడ్ డేట్ ను వెంటనే ప్రకటించాలి
2) 2021, 2025 వేతన సవరణలను వెంటనే అమలుపర్చాలి
3) ఆర్.టి.సిలోని కార్మిక సంఘాలను పునరుద్ధరించి, యూనియన్ ఎన్నికలను వెంటనే జరిపించాలి
4) ఆర్ పీఎస్ 2017 సంవత్సరానికి సంబంధించిన ఏరియర్స్ ను రిటైర్డ్, సర్వీస్ లో ఉన్న ఉద్యోగులందరికీ వెంటనే చెల్లించాలి
5) 2019లో 55 రోజులు సమ్మె కాలంలో ఆర్.టి.సి కార్మికులపై పెట్టిన పోలీస్ కేసులను వెంటనే ఎత్తివేయాలి
6) రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు రావలసిన అన్ని రకాల బకాయిలను వెంటనే చెల్లించడంతోపాటు ఆర్.టి.సి మేనేజ్మెంట్ తన అవసరాల కోసం వాడుకున్న కార్మికుల డబ్బులు, పీఎఫ్, ఎస్.బి.టి డబ్బులను ఆయా సంస్థలకు వెంటనే చెల్లించాలి
7) ఆర్.టి.సి లో ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీమ్‌కు సంబంధించిన ప్రభుత్వ రీయంబర్స్‌మెంట్ డబ్బులు దాదాపు రూ. 400 కోట్లు ఏ నెలకు ఆ నెలకు క్రమం తప్పకుండా చెల్లించాలి
8) అద్దె బస్సులను, అద్దె బస్సుల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఆర్.టి.సి సంస్థలో విలీనం చేయాలి
ఆర్.టి.సి. యాజమాన్యం పరిష్కరించాల్సినవి..
1) ఆర్.టి.సి. లో ఎలక్ట్రిక్ బస్సులు రావడం వల్ల ఎక్సెస్ పేరుతో సిటీలో ఉన్న డ్రైవర్ కండక్టర్, మెకానిక్ అదనపు సిబ్బందిగా చూపుతూ వేరే రీజియన్ లకు పంపించాలని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని వారిని సిటీలోనే కొనసాగించాలి
2) ఆర్.టి.సి.లో మహాలక్ష్మి స్కీమ్ ప్రవేశపెట్టిన తర్వాత డ్రైవర్ కండక్టర్ల పై రాస్తున్న అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి
3) చట్ట వ్యతిరేక డ్యూటీలను రద్దు పరిచి ఎం.టి.డబ్ల్యూ యాక్ట్ ప్రకారం సవరించాలి
4) డిపోలలో కార్మికులపై అధికారుల, సూపర్ వైజర్ ల వేధింపులు మానుకోవాలి
5) హైకోర్టు ఆదేశాల ప్రకారం బ్రీత్ ఎనలైజర్ కేసులలో సదరు డ్రైవర్ ను గవర్నమెంట్ హాస్పిటల్ కు పంపి గవర్నమెంట్ డాక్టర్ నిర్ధారించిన తర్వాతనే చర్యలు తీసుకోవాలి
6) ఆర్.టి.సి. లోని వివిధ కేటగిరీలో ఉన్న ఖాళీలను రెగ్యులర్ ప్రాతిపదికన వెంటనే భర్తీ చేయడంతో పాటు బ్రెడ్ విన్నర్స్ స్కీమ్ లో తీసుకుని రిక్రూట్ మెంట్ చేసుకునే వారిని రెగ్యులర్ ప్రాతిపదికని తీసుకోవాలి
7) జూనియర్ అసిస్టెంట్ పరీక్షలు రాసి పాసైన సంస్థ ఉద్యోగులను వెంటనే జూనియర్ అసిస్టెంట్ గా నియమించాలి
8) తార్నాక హాస్పిటల్ లో ఉద్యోగులకు నాణ్యమైన వైద్య సదుపాయాన్ని అందించడంతో పాటు ఉద్యోగుల తల్లిదండ్రులను కూడా రిఫరల్ హాస్పిటల్ కు పంపి వైద్య సదుపాయం కల్పించాలి
9) ఆర్.టి.సి లోని కార్మికులకు రావలసిన అన్ని రకాల బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు, ఆర్.టి.సి. మేనేజ్మెంట్ వాడుకున్న పీఎఫ్. ఎస్.బి.టి. ఎస్ఆర్బీఎస్, సీసీఎస్ డబ్బులను ఆయా సంస్థలకు వెంటనే చెల్లించాలి
10) గ్రేటర్ హైదరాబాద్ జోన్ అకౌంట్స్ విభాగంలో ప్రవేశపెట్టిన సెంట్రలైజేషన్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనసాగించాలి
11) వాంట్ ఆఫ్ డ్రైవర్ సందర్భంలో కండక్టర్ కు, వాంట్ ఆఫ్ కండక్టర్ సమయంలో డ్రైవర్లకు అటెండెన్స్ ఇవ్వడంతో పాటు, స్పేర్ డ్యూటీ లో ఉన్న డ్రైవర్ కండక్టర్లకు డ్యూటీ దొరకని పక్షంలో అటెండెన్స్ ఇవ్వాలి
12) డబుల్ డ్యూటీ కి డబుల్ వేతనం చెల్లించాలి
13) ఆర్.పి.ఎస్ 2013, 2017కు సంబంధించిన పి.ఎఫ్ రికవరీ డబ్బులను కార్మికుల ఖాతాలలో వెంటనే డిపాజిట్ చేయడం ద్వారా రిటైర్ అయిన ఉద్యోగులకు పి.ఎఫ్ పెన్షన్ పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలి.
14) ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారులు, సూపర్‌వైజర్ లను తీసేసి, వారి స్థానంలో ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలి.
INTUC చైర్మన్- RTC JAC జీ సంజీవ రెడ్డి, INTUC రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ మొగుళ్ల రాజిరెడ్డి, టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామరెడ్డి, SWU-INTUC ప్రధాన కార్యదర్శి జక్కుల మల్లేశ్ గౌడ్, TJMU ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్, NMU ప్రధాన కార్యదర్శి ఎం.నరేందర్, BRTU General Secreatry W.U వెంకటేశ్వర్లు, STMU ప్రధాన కార్యదర్శి హరికిషన్, బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి స్వామి కుమార్ పొన్నంకు విన్నవించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



