Naga Chaitanya | వృషకర్మ ఈవెంట్‌లో నాగచైతన్యకు తప్పిన ప్రమాదం – అసలేం జరిగిందంటే?
వృషకర్మ మూవీ గ్లింప్స్‌ను గురువారం రిలీజ్ చేశారు.ఈ ఈవెంట్‌లో నాగచైతన్యు ప్రమాదం తప్పింది. అతడు కూర్చున్న కుర్చీ వంగిపోవడంతో వెనక్కి పడిపోయాడు చైతూ. ఈ ప్రమాదంలో చైతన్యకు ఎలాంటి గాయాలు కాలేదు.
Naga Chaitanya | వృషకర్మ మూవీ ఈవెంట్‌లో నాగచైతన్యకు ప్రమాదం తప్పింది. ఈ మూవీ గ్లింప్స్‌ను గురువారం రిలీజ్ చేశారు. హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్‌లోని పీసీఎక్స్ స్క్రీన్‌లో ఈవెంట్‌ను నిర్వహించారు. స్టేజ్‌పై సినిమా యూనిట్ మెంబర్స్ కోసం కుర్చీలు వేశారు. ఓ కుర్చీలో నాగచైతన్య కూర్చొగానే అది వంగిపోయింది. దాంతో నాగచైతన్య వెనక్కి పడిపోయారు. దర్శకుడితో పాటు సెక్యూరిటీ సిబ్బంది వచ్చి నాగచైతన్యను లేపారు. ఈ సంఘనటతో అభిమానులతో పాటు యూనిట్ సభ్యులను కలవరపాటుకు గురయ్యారు. నాగచైతన్యకు దెబ్బలు తగిలి ఉండవచ్చని కంగారు పడ్డారు. కానీ తాను సేఫ్ అంటూ నాగచైతన్య చెప్పారు. ప్రెస్‌మీట్‌ను కంటిన్యూ చేశారు.
ఈ క్రమంలో సిబ్బందిపై నాగచైతన్య అసహనం వ్యక్తం చేశారు. అక్కినేని ఫ్యాన్స్ కూడా ప్రసాద్ ఐమాక్స్ సిబ్బందిని తెగ ట్రోల్ చేస్తున్నారు.
హాలీవుడ్ లెవెల్‌లో...
వృషకర్మ గ్లింప్స్ హారర్ ఎలిమెంట్స్‌తో ఆసక్తిని పంచుతోంది. ఈ మూవీకి విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అర్జున్‌గా స్టైలిష్ కమ్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో నాగచైతన్య కనిపించబోతున్నారు. అతీంద్రియ శక్తిని అర్జున్ ఎలా ఎదురించాడు? అనే అంశాలతో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు గ్లింప్స్ చూస్తుంటే తెలుస్తోంది. విజువల్స్, బీజీఎమ్, స్పెషల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి.
మీనాక్షి చౌదరి హీరోయిన్...
వృషకర్మలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో మలయాళ నటుడు జయరామ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. సుకుమార్‌తో కలిసి సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
https://x.com/TeluguScribe/status/2029504393897517381
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



