BRSV Protest | బండి సంజయ్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి.. డీజీపీ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్‌వీ నేతల డిమాండ్
BRSV Protest | కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్‌వీ నాయకులు డిమాండ్ చేశారు. ఆయన కుమారుడు సాయి భగీరథ్ (Sai Bhagirath) ఓ బాలికపై అత్యాచార యత్నం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. డీజీపీ కార్యాలయం (DGP Office) వద్ద బీఆర్ఎస్వీ నాయకులు ఆందోళన చేపట్టారు.
BRSV Protest | త్రినేత్ర.న్యూస్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్‌వీ నాయకులు డిమాండ్ చేశారు. ఆయన కుమారుడు సాయి భగీరథ్ (Sai Bhagirath) ఓ బాలికపై అత్యాచార యత్నం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పోక్సో కేసు నమోదైనప్పటికీ బండి కుమారుడిని ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం డీజీపీ కార్యాలయం (DGP Office) వద్ద బీఆర్ఎస్వీ నాయకులు ఆందోళన చేపట్టారు.

ఈ క్రమంలో డీజీపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో గేటు వద్దే నేలపై బైఠాయించి ప్రభుత్వానికి, బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే సాయి భగీరథ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాల్సింది పోయి కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రెండు మూడు నెలలుగా బాలిక తల్లదండ్రులు పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరిగినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇన్ని రోజులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేశారు. చట్టాలు పెద్దోళ్లకు ఒకతీరు, పేదోళ్లకు ఒకతీరు ఉంటయా అని ప్రశ్నించారు. సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైనప్పటికీ ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. బాధిత బాలికకు వెంటనే న్యాయం చేయకపోతే బీఆర్ఎస్‌వీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.
బేటీ పడావో, బేటీ బచావో అని చెప్పేది ఉట్టి జూటానేనా అని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం, బీజేపీ లోపాయకారి ఒప్పందంతో పని చేస్తున్నాయని ఆరోపించారు. బండి సంజయ్‌ను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ నుంచి చేయాలని డిమాండ్ చేశారు. బండి ఆయన కొడుకును ఎందుకు వెనకేసుకొస్తున్నాడో చెప్పాలన్నారు. మాజీ జర్నలిస్టుతో బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరిపించడం ఏంటని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు, నాయకులు యాద క్రాంతి, అభి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Live: డీజీపీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్వీ నిరసన https://t.co/guh4y71k3T
— BRS Party (@BRSparty) May 10, 2026
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



