Hardeep Singh Puri | ఎప్‌స్టీన్ నన్ను టూ-ఫేస్డ్ అన్నారు : కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి
Hardeep Singh Puri | అమెరికన్ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein) ఫైల్స్ (Epstein Files)లో తన పేరు ఉందంటూ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి (Hardeep Singh Puri) స్పందించారు.
Hardeep Singh Puri | అమెరికన్ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein) ఫైల్స్ (Epstein Files)లో తన పేరు ఉందంటూ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి (Hardeep Singh Puri) స్పందించారు. అంతేకాదు, ఎప్‌స్టీన్‌ను కలిసిన మాట వాస్తవమేనని.. కానీ వృత్తిపరమైన పనుల నిమిత్తమే ఆయన్ని కలిసినట్లు వివరణ ఇచ్చారు. ఈ మేరకు రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎప్‌స్టీనే తనను ‘టూ-ఫేస్డ్’ అని అభివర్ణించాడని, ఈమెయిళ్లను పూర్తిగా చదివి ఉంటే రాహుల్ ఈ ఆరోపణలు చేసేవారు కాదంటూ కేంద్ర మంత్రి చురకలంటించారు. రాహుల్ గాంధీవి నిరాధారమైన ఆరోపణలు అని ఫైర్ అయ్యారు.
అవును కలిశాను..
రాహుల్ ఆరోపణలపై కేంద్ర మంత్రి స్పందిస్తూ.. నేను ఎప్‌స్టీన్‌ను కలిసిన మాట వాస్తవమే. అయితే, ఆయన చేసిన నేరాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంటర్నేషనల్ పీస్ ఇనిస్టిట్యూట్ (ఐపీఐ)లో పని చేసినప్పుడు ఎప్‌స్టీన్‌ను కలిశాను. ఐపీఐలో మా బాస్ తెజ్రె రాడ్ లార్సెన్‌కు ఎప్‌స్టీన్ తెలుసు. అలా ఆయన ద్వారా మా సంస్థ చర్చల సందర్భంగా ఎప్‌స్టీన్‌ను నాలుగు సార్లు కలిశాను. అంతేతప్ప ఆయన చేసిన నేరాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. పూర్తి వృత్తిపరమైన అంశాల్లోనే ఆయనను కలిశాను. వారి చేసే పనులకు నేను సరైన వ్యక్తిని కాకపోవడం వల్లే బహుశా ఎప్‌స్టీన్ నన్ను టూ-ఫేస్డ్ అని అని ఉంటాడు. ప్రతిపక్షనేత నాపై నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారు అని హర్దీప్ సింగ్ పురి మండిపడ్డారు.
కాగా, బుధవారం లోక్‌సభలో రాహుల్ ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను ప్రస్తావించారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు ఉందని అన్నారు. అంతేకాదు, అదానీ, అనిల్ అంబానీ పేర్లు ఉన్న విషయాన్ని కూడా రాహుల్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం లోక్‌సభలో గందరగోళం నెలకొంది. రాహుల్ వ్యాఖ్యలపై అధికారపక్షం ఎంపీలు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రతిపక్ష నేతలకు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం అలవాటే అంటూ మండిపడ్డారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






