Travels Bus | కీసర వద్ద ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రయాణికులు క్షేమం
Travels Bus | మరో ప్రైవేటు బస్సు (Travels Bus) అగ్నికి ఆహుతయింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులు బతికి బయటపడ్డారు.
Travels Bus | త్రినేత్ర.న్యూస్: మరో ప్రైవేటు బస్సు (Travels Bus) అగ్నికి ఆహుతయింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులు బతికి బయటపడ్డారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌గేట్ (Keesara) వద్ద చోటుచేసుకున్నది.
ఇంటర్‌సిటీ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు 39 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నది. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున కంచికచర్ల మండలం కేసర టోల్‌గేట్ వద్ద బస్సు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు (Bus caught fire) చెలరేగాయి. గమనించిన డ్రైవర్ అప్రమత్తమయ్యారు. బస్సును ఆపి ప్రయాణికులను అందులో నుంచి దించేశాడు. అయితే మంటలు విస్తరించడంతో చూస్తుండగా బస్సు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉన్నది.
[video width="848" height="478" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/02/WhatsApp-Video-2026-02-07-at-7.36.51-AM.mp4"][/video]
నెలమంగల సమీపంలో మరో బస్సు బుగ్గి
కర్ణాటకలోని నెలమంగల సమీపంలో మరో ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలి బూడిదయింది. బెంగళూరు నుంచి కలబురగికి వెళుతున్న సంజనా ట్రావెల్స్‌కు చెందిన బస్సు నెలమంగల తాలూకా హనుమంతపుర గేటు వద్ద ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి విద్యుత్తు స్తంభానికి ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దీంతో బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులను డ్రైవరు, సిబ్బంది కిందకు దించి మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అవి ఆగకపోవడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. దీంతో ప్రయాణికుల లగేజీ మొత్తం మంటల్లో బూడిదగా మారింది.
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

Srinivas Goud | పాదయాత్ర భయంతోనే పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రివ్యూ: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



