త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

S Keerthana | విజ‌య్ మంత్రివ‌ర్గంలో ఏకైక‌ మ‌హిళ‌.. అతి పిన్న‌వ‌య‌స్కురాలిగా రికార్డు

S Keerthana | త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా విజ‌య్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయ‌న‌తోపాటు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మంత్రుగా ప్ర‌మాణం చేశారు. వారిలో శివ‌కాశి (Sivakasi) ఎమ్మెల్యే సెల్వి ఎస్. కీర్త‌న (S Keerthana) కూడా ఉన్నారు.

G

National | Published On May 10, 2026, 11.18 am IST

S Keerthana | విజ‌య్ మంత్రివ‌ర్గంలో ఏకైక‌ మ‌హిళ‌.. అతి పిన్న‌వ‌య‌స్కురాలిగా రికార్డు
Advertisement

S Keerthana | త్రినేత్ర‌.న్యూస్‌: త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా విజ‌య్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయ‌న‌తోపాటు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మంత్రుగా ప్ర‌మాణం చేశారు. వారిలో శివ‌కాశి (Sivakasi) ఎమ్మెల్యే సెల్వి ఎస్. కీర్త‌న (S Keerthana) కూడా ఉన్నారు. 28 ఏండ్ల వ‌య‌స్సులో మంత్రిగా నియ‌మితురాలైన ఆమె అతి పిన్న‌వ‌య‌స్కురాలిగా రికార్డుల్లో నిలిచారు. సామాన్య నేప‌థ్యం నుంచి వ‌చ్చిన ఆమె విద్య‌నే ఆయుధంగా మ‌ల‌చుకున్నారు. ఎమ్మెస్సీ ప‌ట్ట‌భ‌ద్రురాలైన కీర్త‌నకు చ‌దువుకునే రోజుల నుంచే స‌మాజం ప‌ట్ల, రాజ‌కీయాల ప‌ట్ల స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉన్న‌ది.

రాజ‌కీయాల్లోకి రాకముందు కీర్త‌న‌.. పొలిటిక‌ల్ క‌న్స‌ల్టెంట్‌గా ప‌నిచేశారు. ఎన్నిక‌ల వ్యూహాలు, ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌, సామాజిక స‌మ‌స్య‌ల విశ్లేష‌ణ‌లో ఆమెకున్న అనుభ‌వం టీవీకే పార్టీలో ఆమె ఎదుగుద‌ల‌కు తోడ్ప‌డింది. అదే ఆమెను ఒక లీడ‌ర్‌గా తీర్చిదిద్దింది. శివ‌కాశి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యేగా ఆమె నిలిచారు.

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏఎంఎస్‌జీ అశోక‌న్‌పై 11,670 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. ఆయ‌న గ‌తంలో రెండు సార్లు అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో రాజ‌కీయాల్లో అడుగుపెట్టిన మొద‌టిసారే సీనియ‌ర్ ఎమ్మెల్యేను ఓడ‌గొట్టారు. ఈ నేప‌థ్యంలో 1957 నుంచి మొద‌టిసారి గెలుపొందిన‌ కాంగ్రెస్‌, ద్ర‌విడ పార్టీయేత‌ర వ్య‌క్తిగా, తొలి మ‌హిళా ఎమ్మెల్యేగా, టీవీకేలో (TVK) అత్యంత పిన్న వ‌య‌స్కురాలైన ఎమ్మెల్యేగా నిలిచారు.

 

Advertisement
Advertisement