CM Devendra Fadnavis | నాయకత్వాన్ని కాపాడుకోవడమే రాహుల్ గాంధీ లక్ష్యం: సీఎం దేవేంద్ర ఫడ్నవిస్
CM Devendra Fadnavis | కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీని నాయకుడిగా తప్పించే వాతావరణం ఏర్పడుతోందని, పార్టీకి ఎన్నికల్లో విజయాలను అందించడంలో విఫలమవుతున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు. నాగ్‌పూర్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
CM Devendra Fadnavis | కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీని నాయకుడిగా తప్పించే వాతావరణం ఏర్పడుతోందని, పార్టీకి ఎన్నికల్లో విజయాలను అందించడంలో విఫలమవుతున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు. నాగ్‌పూర్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్‌ను నాయకత్వం నుంచి తప్పించాలనే వాతావరణం ఏర్పడుతుందని, ఆయన సారథ్యంలో ఆ పార్టీ విజయాలను సాధించలేకపోతుందని అన్నారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యల నేపథ్యంలోనే..
రాహుల్ గాంధీ ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్తు, నాయకత్వాన్ని కాపాడుకోవడానికే పోరాడుతున్నారని ఫడ్నవిస్ అన్నారు. వరుస ఓటముల నేపథ్యంలో తన స్థానం నిలబెట్టుకోవడమే ఆయన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కాగా అంతకు ముందు రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్, బీజేపీలపై ఘాటుగా విమర్శలు చేశారు. దేశ రాజ్యాంగాన్ని అంతం చేయడమే వారి ప్రధాన ఉద్దేశమని ఆరోపణలు చేశారు. రాజ్యాంగం లేకపోతే మనం భారతదేశంగా పిలిచే దేశం ఉండేది కాదని, ఆర్ఎస్ఎస్-బీజేపీ భావజాలం కలిగిన వారు రాజ్యాంగాన్ని తొలగించాలనుకుంటున్నారని అన్నారు. వారు ఏం చెప్పినా, అందరికీ సమాన హక్కులు ఉండకూడదనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని తొలగించాలని అనుకుంటున్నారని రాహుల్ వ్యాఖ్యలు చేశారు. అయితే రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఫడ్నవిస్ ఆ ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయని, వాటి నుంచి దృష్టి మళ్లించడానికే రాహుల్ గాంధీ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని సీఎం ఫడ్నవిస్ అన్నారు. పార్టీలో నెలకొన్న అంతర్గత సంఘర్షణలను దాచి పెట్టేందుకు రాహుల్ యత్నిస్తున్నారని ఆరోపించారు.
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



