త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TVK Vijay | ఎల్‌జీ జోక్యం నుంచి విముక్తం చేస్తాం.. పుదుచ్చేరి వాసుల‌కు విజ‌య్ హామీ

TVK Vijay | లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ జోక్యం నుంచి విముక్తం చేస్తామ‌ని పుదుచ్చేరి ప్ర‌జ‌ల‌కు టీవీకే విజ‌య్ హామీ ఇచ్చారు. ఏప్రిల్ 9న పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నిక‌ల జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే.

P

National | Published On Apr 4, 2026, 3.29 pm IST

TVK Vijay | ఎల్‌జీ జోక్యం నుంచి విముక్తం చేస్తాం.. పుదుచ్చేరి వాసుల‌కు విజ‌య్ హామీ
Advertisement

TVK Vijay | లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ జోక్యం నుంచి విముక్తం చేస్తామ‌ని పుదుచ్చేరి ప్ర‌జ‌ల‌కు టీవీకే విజ‌య్ హామీ ఇచ్చారు. ఏప్రిల్ 9న పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నిక‌ల జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో విజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌-డీఎంకే కూట‌మిని 'గందరగోళ కూటమి'గా అభివర్ణించారు. అలాగే, ఎన్ఆర్ కాంగ్రెస్‌- బీజేపీ కూట‌మి సొల‌సిపోయిన కూట‌మిగా పేర్కొన్నారు. కేంద్రంలో ఏళ్లుగా అధికారంలోకి ఉన్నా రాష్ట్ర హోదాను సాధించ‌డంలో రెండు జాతీయ పార్టీలు విఫ‌ల‌మ‌య్యాయ‌ని విమ‌ర్శించారు. ఓట‌ర్లు మ‌త ఈల (విజిల్‌) గుర్తుకు ఓటేసి గెలిపించాల‌ని కోరారు. పుదుచ్చేరికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తానని ప్రతిజ్ఞ చేశారు. చట్టబద్ధంగా పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను సాధించేందుకు నూటికి నూరు శాతం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రజల పక్షాన నిలిచేవారిగా తన పార్టీ అభ్యర్థులను పరిచయం చేస్తూ.. విజయ్ పలు ప్రజా సంక్షేమ పథకాల జాబితాను వెల్లడించారు. టీవీకే అధికారంలోకి వ‌చ్చిన ఆరు నెల‌ల్లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల విలువైన వైద్య బీమా, బీపీఎల్ కుటుంబాల‌కు 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విదు్య‌త్ అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. విద్యా రంగంలో 'పుదుచ్చేరి అప్లైడ్ సైన్సెస్ అండ్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం'ను ఏర్పాటు చేస్తామని విజయ్ ప్రకటించారు. ఈ ప్రాంత అభివృద్ధిపై తనకున్న నిబద్ధతను పునరుద్ఘాటించారు. సురక్షితమైన, పారదర్శకమైన పరిపాలనను అందించే అవ‌కాశం కల్పించాలని ఓటర్లను కోరారు. కూటమి రాజకీయాల‌పై విజయ్ చేసిన వ్యాఖ్య‌లు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. జాతీయ పార్టీలు రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని ఆయన ఆరోపించారు. ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

Advertisement
Advertisement