Ministry of Home Affairs | ప్రోటోకాల్ ఉల్లంఘన.. బెంగాల్ ప్రభుత్వంపై కేంద్రం సీరియస్..!
Ministry of Home Affairs | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ మధ్య వివాదం మరింత తీవ్రమైంది. ఈ విషయంలో స్పష్టమైన వివరాలు ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తికి కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ లేఖ రాశారు.
Ministry of Home Affairs | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ మధ్య వివాదం మరింత తీవ్రమైంది. ఈ విషయంలో స్పష్టమైన వివరాలు ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తికి కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ లేఖ రాశారు. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, పోలీసులు ఎందుకు హాజరుకాలేదో వివరణ ఇవ్వాలని, రాష్ట్రపతి కోసం ఏర్పాటు చేసిన వాష్‌రూమ్‌లో నీటి సౌకర్యం లేకపోవడం, రాష్ట్రపతి కాన్వాయ్ వెళ్లే మార్గం చెత్తతో నిండిపోవడంపై వివరణ కోరింది.
అలాగే, డార్జిలింగ్ జిల్లా మేజిస్ట్రేట్, సిలిగుడి పోలీస్ కమిషనర్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ను బాధ్యులను చేస్తూ.. వారిపై తీసుకున్న చర్యేలు ఏంటో చెప్పాలంటూ ఆదివారం వరకు సాయంత్రం వరకు సమయం ఇచ్చింది. శనివారం రాష్ట్రపతి అంతర్జాతీయ సంతాల్ సదస్సు కోసం బెంగాల్‌కు చేరుకున్నారు. చివరి నిమిషంలో వేదిక మారడడంతో కొందరు ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. పోట్రోకాల్ ప్రకారం.. రాష్ట్రపతిని స్వాగతించేందుకు సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు ఎవరూ హాజరుకాలేదు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






