Budget 2026 | ఈవీల నుంచి క్యాన్సర్ మందుల దాకా.. బడ్జెట్‌తో ధరలు తగ్గేవి ఇవే..!
Budget 2026 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రకటనలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడకుండా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా ఎగుమతులను ప్రోత్సహించేందుకు, దేశీయంగా వినియోగాన్ని పెంచేందుకు కొన్ని దిగుమతి సుంకాల్లో కోతలు విధించింది. దాంతో వ్యాపారులకు, పరిశ్రమలకు ఊరట లభించనుంది.
Budget 2026 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రకటనలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడకుండా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా ఎగుమతులను ప్రోత్సహించేందుకు, దేశీయంగా వినియోగాన్ని పెంచేందుకు కొన్ని దిగుమతి సుంకాల్లో కోతలు విధించింది. దాంతో వ్యాపారులకు, పరిశ్రమలకు ఊరట లభించనుంది.
ధరలు తగ్గేవి ఇవే..
- ప్రాసెస్డ్ సముద్ర ఆహార ఉత్పత్తులపై డ్యూటీ-ఫ్రీ దిగుమతి పరిమితిని పెంచారు. దీంతో మత్స్య పరిశ్రమకు మేలు చేకూరనున్నది. ఫలితంగా ఆయా ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం ఉంది.
- షూ అప్పర్స్ ఎగుమతులను ప్రోత్సహించేందుకు డ్యూటీ-ఫ్రీ దిగుమతులకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. దాంతో విదేశాలకు ఎగుమతి చేసే షూల తయారీ ఖర్చు తగ్గడంతో పాటు, దేశీయంగా అమ్మే షూల ధరలు కూడా తగ్గనున్నాయి.
- లెదర్, టెక్స్‌టైల్ గార్మెంట్స్ ఎగుమతులకు ఉపయోగించే ముడి సరుకులపై దిగుమతి మినహాయింపు గడువును మరో ఏడాది పొడిగించారు. ఫలితంగా దేశీయంగా వీటి ధరలు స్థిరంగా కొనసాగే అవకాశం ఉంటుంది.
- లిథియం-అయాన్ బ్యాటరీల తయారీకి ఉపయోగించే పదార్థాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. దాంతో బ్యాటరీలు ధరలు తగ్గనున్నాయి. అలాగే, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గే అవకాశాలున్నాయి.
- టెలివిజన్ గ్లాస్, ఫైర్ ఫైటింగ్ పరికరాల తయారీలో ఉపయోగించే సోడియం యాంటిమోనేట్‌పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులు ప్రకటించారు. దాంతో ఆయా ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి.
- అణు విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన వస్తువుల దిగుమతిపై మినహాయింపు కొనసాగనుంది.
- కీలక ఖనిజాల ప్రాసెసింగ్‌కు అవసరమైన పదార్థాల దిగుమతికి మినహాయింపును ప్రకటించారు. ఇది సెమీకండక్టర్ రంగానికి ఊతమివ్వనున్నది. మైనింగ్ ఖర్చులు తగ్గనున్నాయి.
- బయోగ్యాస్ బ్లెండెడ్ సీఎన్‌జీపై కస్టమ్స్ డ్యూటీలో నుంచి బయోగ్యాస్ విలువను మినహాయించారు. దీంతో ధరలు తగ్గనున్నాయి.
- విమాన తయారీ భాగాలపై ప్రమరీ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ప్రతిపాదనతో భారత్‌లో విమాన తయారీ ఖర్చు తగ్గి, ‘మేక్ ఇన్ ఇండియా’కి మద్దతుగా ఇవ్వనున్నది.
- రక్షణ విమాన భాగాల తయారీకి అవసరమైన ముడి సరుకులపై కూడా డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. దీంతో దేశీయ రక్షణ పరిశ్రమకు మేలు చేకూరి, విదేశీ సంస్థలతో భాగస్వామ్యం పెరగనుంది.
- మైక్రోవేవ్ ఓవెన్ల తయారీలో ఉపయోగించే భాగాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. ఇవి మరింత చౌకగా లభించనున్నాయి.
- వ్యక్తిగత వినియోగానికి దిగుమతి చేసే అన్ని డ్యూటీ వర్తించే వస్తువులపై టారిఫ్‌ను 10 శాతానికి తగ్గించారు.
- క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే 17 ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ ఇచ్చారు. ఇతర తీవ్రమైన వ్యాధుల కోసం 7 ఔషధాలపై ప్రైవేట్ దిగుమతి డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. దాంతో బాధితులకు తక్కువ ధరకే మందులు అందడంతో అదనపు భారం తగ్గుతుంది.
తాజావార్తలు
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్






