Nationwide CCTV | దేశవ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్.. డ్రగ్స్ రవాణాకు చెక్
మార్చి 31 నాటికి దేశం నుంచి మావోయిస్టు హింస ఇక ఉండదు. పూర్తిగా తుడిచిపెట్టేస్తాం. ఇదే మన భద్రతా దళాలు సాధించబోయే అతి పెద్ద విజయం అని ఈసందర్భంగా అమిత్ షా స్పష్టం చేశారు.
Nationwide CCTV | డ్రగ్స్ రవాణా, డ్రగ్స్ వినియోగం వల్ల దేశ యువత పెడదారి పడుతోంది. దేశవ్యాప్తంగా డ్రగ్స్ రవాణాను అడ్డుకునేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా పటిష్టమైన సీసీటీవీ కెమెరా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయబోతున్నామని.. అది కూడా అన్ని రాష్ట్రాలను కలుపుతూ ఒక భారీ సీసీటీవీ నెట్‌వర్క్ ఏర్పాటు కాబోతోందని అమిత్ షా స్పష్టం చేశారు. ఢిల్లీ పోలీసుల 79వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న కేంద్ర హోమంత్రి ఈసందర్భంగా సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
మాదక ద్రవ్యాల రవాణా అడ్డుకోవడమే లక్ష్యం
మాదక ద్రవ్యాల రవాణా అడ్డుకోవడమే ఈ నెట్‌వర్క్ లక్ష్యమని, వీటిని పర్యవేక్షించడానికి ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నట్టు అమిత్ షా స్పష్టం చేశారు. దీనికి లీగల్ సెక్యూరిటీ కల్పించడం వల్ల రియల్ టైమ్‌లో డ్రగ్స్ నేరాలు జరగకుండా ముందే పసిగట్టగలం అని అమిత్ షా తెలిపారు.
సరిహద్దుల్లో టైట్ సెక్యూరిటీ
ఈ నెట్‌వర్క్ వల్ల సరిహద్దుల్లోనూ టైట్ సెక్యూరిటీ ఉంటుందని.. సరిహద్దుల రక్షణపై కూడా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని అమిత్ షా తెలిపారు. దేశం చుట్టూ ఉన్న ప్రతి బోర్డర్‌లో ఈ వ్యవస్థ ఏర్పాటు కానుంది. దీని వల్ల బోర్డర్ నుంచి చొరబాటుదారులు రాకుండా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కి ఈ నెట్‌వర్క్‌కి సమన్వయం ఏర్పాటు చేస్తామని అమిత్ షా వెల్లడించారు.
మార్చి 31 నాటికి ఒక్క మావోయిస్టు ఉండడు
మావోయిస్టుల ఏరివేతపై ఇప్పటికే కేంద్రం డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. దాని ప్రకారం మావోయిస్టు గ్రూప్‌లను భద్రతా దళాలు మట్టుపెడుతున్నాయి. ఈనేపథ్యంలో మార్చి 31 నాటికి దేశం నుంచి మావోయిస్టు హింస ఇక ఉండదు. పూర్తిగా తుడిచిపెట్టేస్తాం. ఇదే మన భద్రతా దళాలు సాధించబోయే అతి పెద్ద విజయం అని ఈసందర్భంగా అమిత్ షా స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

BJP | రాహుల్ రిమోట్ కంట్రోల్ పాకిస్థాన్‌లో ఉంది : బీజేపీ
మే 20, 2026

Amit Shah Felicitates Telangana Police | తెలంగాణ పోలీసులకు అరుదైన గౌరవం: ‘నక్సల్స్ ఫ్రీ’ ఆపరేషన్‌పై అమిత్ షా ప్రశంసల జల్లు
మే 18, 2026

Jihadi Drug | రూ.182 కోట్ల విలువైన జిహాదీ డ్రగ్స్ పట్టివేత.. అమిత్ షా కీలక ప్రకటన
మే 16, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



