త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sunetra Pawar | మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర ప‌వార్‌.. భ‌ర్త స్థానంలో రేపు ప‌ద‌వీ ప్ర‌మాణ‌స్వీకారం..!

Sunetra Pawar | ఎన్‌సీపీ నేత‌, మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ఇటీవ‌ల విమాన ప్ర‌మాదంలో మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు జ‌రుగ‌నున్నాయి. అజిత్ దాదా భార్య‌, రాజ్య‌స‌భ స‌భ్యురాలు సునేత్ర ప‌వార్ ఉప ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

P

National | Published On Jan 30, 2026, 9.55 pm IST

Sunetra Pawar | మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర ప‌వార్‌.. భ‌ర్త స్థానంలో రేపు ప‌ద‌వీ ప్ర‌మాణ‌స్వీకారం..!
Advertisement

Sunetra Pawar | ఎన్‌సీపీ నేత‌, మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ఇటీవ‌ల విమాన ప్ర‌మాదంలో మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు జ‌రుగ‌నున్నాయి. అజిత్ దాదా భార్య‌, రాజ్య‌స‌భ స‌భ్యురాలు సునేత్ర ప‌వార్ ఉప ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అధికార మహాకూటమిలోని ఎన్‌సీపీలో నాయకత్వ చర్చలు తుది దశకు చేరుకున్నాయని సమాచారం. సునేత్ర పవార్ ఈ ప్రతిపాదనను అంగీకరించారని, శనివారం జరగనున్న ఎన్‌సీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆమె నాయకురాలిగా ఎన్నికయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ఆమె రేపే ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంలో తుది నిర్ణయం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీనే తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఎన్‌సీపీ ఏ నిర్ణయం తీసుకున్నా, మహాకూటమి దానిని అంగీకరిస్తుందన్నారు. ఈ సున్నితమైన సమయంలో దివంగత అజిత్ పవార్ కుటుంబానికి, ఎన్‌సీపీ పార్టీకి ప్రభుత్వం అండగా ఉంటుందని ఫడ్నవీస్ చెప్పారు. ఎన్‌సీపీ శాసనసభాపక్ష సమావేశం జనవరి 31న జరుగుతుందని మంత్రి ఛగన్ భుజ్‌బల్ శుక్రవారం తెలిపారు. సమావేశంలో దివంగత ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నికయ్యే అవకాశం ఉంద‌ని చెప్పారు. ఉపముఖ్యమంత్రి బాధ్యతలు సునేత్ర పవార్ చేపట్టాలని చాలా మంది పార్టీ నాయకులు కోరుకుంటున్నారని భుజ్‌బల్ పేర్కొన్నారు. శాసనసభాపక్షం అలా నిర్ణయిస్తే, శనివారమే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సూచించారని కూడా ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement