Bombardier Learjet 45 | అజిత్ పవార్ ప్రాణాలు తీసిన ‘లియర్‌జెట్45’.. ఈ విమానం ప్రత్యేకతలు ఇవే..!
Bombardier Learjet 45 | మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్( Ajit Pawar ) విమానం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. సాంకేతిక సమస్య తలెత్తిన నేపథ్యంలో పైలట్ రెండుసార్లు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విమానం ఓ బండరాయిని ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రత మరింత పెరిగి మంటలు చెలరేగినట్లు సమాచారం.
Bombardier Learjet 45 | మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్( Ajit Pawar ) విమానం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. సాంకేతిక సమస్య తలెత్తిన నేపథ్యంలో పైలట్ రెండుసార్లు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విమానం ఓ బండరాయిని ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రత మరింత పెరిగి మంటలు చెలరేగినట్లు సమాచారం. బుధవారం ఉదయం 8.46 గంటలకు పుణె జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు సిబ్బంది సజీవదహనం అయ్యారు.
ఈ విమానం కుప్పకూలిన నేపథ్యంలో అజిత్ పవార్ ప్రయాణించిన విమానం గురించి ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అసలు అజిత్ పవార్ ఏ విమానంలో ప్రయాణించారు..? ఆ విమానం ప్రత్యేకతలు ఏంటి..? ఏ దేశం ఆ విమానాన్ని రూపొందించింది..? అనే విషయాలను తెలుసుకుందాం..
వీఐపీలు మెచ్చిన లియర్‌జెట్ 45
అజిత్ పవార్ ప్రయాణించిన విమానం పేరు లియర్‌జెట్ 45. ఇది ఒక ప్రయివేటు జెట్. ఢిల్లీకి చెందిన వీఎస్ఆర్ ఏవియేషన్ సంస్థ లియర్‌జెట్ 45(Bombardier Learjet 45 ) కార్యకలాపాలను నిర్వహిస్తుంది. 2011లో ఢిల్లీలో స్థాపించబడిన ఈ ఏవియేషన్ సంస్థకు మన దేశంలో ప్రయివేటు విమానయాన రంగంలో కీలక స్థానం ఉంది. లియర్‌జెట్ 45 అనేది కెనడాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బాంబార్డియర్ రూపొందించిన మిడ్ సైజ్ బిజినెస్ జెట్. 1990లలో ఇది మార్కెట్‌లో వచ్చినప్పటికీ.. ఇప్పటికీ ప్రయివేటు చార్టర్ రంగంలో విస్తృతంగా వినియోగంలో ఉంది. వీఐపీలు, పారిశ్రామికవేత్తలతో పాటు వైద్య రంగంలో అత్యవసర సేవల కోసం వినియోగిస్తున్నారు. లియర్‌జెట్ 45కు వీఐపీలు మెచ్చిన జెట్‌గా ప్రాచుర్యం పొందింది.
లియర్‌జెట్45 @ 3000 కి.మీ.
లియర్‌జెట్ 45 ప్రత్యేకత ఏంటంటే.. ఇది ట్విన్ ఇంజిన్ జెట్. 47 అడుగుల విస్తీర్ణంతో పాటు 9,752 కిలోల బరువును కలిగి ఉంది. ఇక 8 నుంచి 9 మంది ప్రయాణించేందుకు వీలుంది. గరిష్ఠంగా గంటకు 860 కి.మీ. వేగంతో దూసుకెళ్లగలదు. గరిష్ఠంగా 51 వేల అడుగుల ఎత్తు వరకు ఎగిరే సామర్థ్యం ఉంది. ఒక్కసారి ఇంధనం నింపితే.. 3 వేల కిలోమీటర్ల వరకు ఏకధాటిగా ప్రయాణించే సామర్థ్యం ఈ లియర్‌జెట్ 45 సొంతం. ప్రమాదానికి గురైన విమానం దేశంలో అతిపెద్ద నాన్-షెడ్యూల్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్లలో ఒకటి.
లియర్‌జెట్ కూలడం ఇదే తొలిసారి కాదు..
లియర్‌జెట్ కూలడం ఇదే తొలిసారి కాదు. 2023లోనూ ఓ సారి కుప్పకూలింది. ఆ ఏడాది సెప్టెంబర్ 14న ముంబయి ఎయిర్‌పోర్టులో లియర్‌జెట్ 45ఎక్స్ఆర్ విమానం ప్రమాదానికి గురైంది. భారీ వర్షం కారణంగా రన్‌వేపై స్కిడ్ అయిన విమానం.. రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఆరుగురు ప్రయాణికులు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇవాళ జరిగిన ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో విమానం భద్రతా ప్రమాణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
100 శాతం సురక్షితం..
అయితే, విమానంలో ఎలాంటి భద్రతా సమస్యలూ లేవని వీఎస్‌ఆర్ వెంచర్స్ అధికారులు తెలిపారు. ఈ విమానం 100 శాతం సురక్షితమని సంస్థ ఉన్నతాధికారి విజయ్ కుమార్ సింగ్ తెలిపారు. దీన్ని ఆపరేట్ చేసే సిబ్బంది చాలా అనుభవజ్ఞులు అని పేర్కొన్నారు. ప్రమాదానికి దృశ్యమానత తక్కువగా ఉండటం ఓ కారణం కావొచ్చన్నారు. అయితే, డీజీసీఏ దర్యాప్తు అనంతరం ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలుస్తాయని వెల్లడించారు.
16 ఏళ్ల అనుభవం.. 60 మంది పైలట్లు..
16 ఏళ్ల నిర్వహణ అనుభవం కలిగిన ఈ సంస్థలో 60 మంది పైలట్లు పని చేస్తున్నారు. వీరి సేవలతో వీఐపీలు, పారిశ్రామికవేత్తలు కూడా సంతృప్తిగా ఉన్నారు. న్యూఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, భోపాల్ నుంచి ఈ సంస్థ తమ కార్యకలాపాలను నిర్వహిస్తుందని విజయ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Woman Lawyer | దారుణం.. కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అఘాయిత్యం
మే 19, 2026

Palghar Road Accident | మహారాష్ట్రలో నెత్తురోడిన హైవే.. నిశ్చితార్థానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 11 మంది మృతి
మే 18, 2026

Seaweed Farming | చేపలు లేవని బాధ లేదు.. సముద్రంలోనే కొత్త వ్యవసాయం: మత్స్యకారుల తలరాత మారుస్తున్న ‘సీవీడ్’ సాగు!
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



