త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FIFA 2026 | ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌.. రేపు విద్యాసంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం

FIFA 2026 | ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ వేళ కేర‌ళ కాంగ్రెస్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఫుట్‌బాల్‌పై ఉన్న అపారమైన అభిమానాన్ని మరోసారి చాటుతూ ఆదివారం అర్ధరాత్రి జరగనున్న ఫిఫా ప్రపంచకప్‌-2026 ఫైనల్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సోమవారం సెలవు ప్ర‌క‌టించింది.

P

National | Published On Jul 19, 2026, 4.42 pm IST

FIFA 2026 | ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌.. రేపు విద్యాసంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం
Advertisement

FIFA 2026 | ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ వేళ కేర‌ళ కాంగ్రెస్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఫుట్‌బాల్‌పై ఉన్న అపారమైన అభిమానాన్ని మరోసారి చాటుతూ ఆదివారం అర్ధరాత్రి జరగనున్న ఫిఫా ప్రపంచకప్‌-2026 ఫైనల్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సోమవారం సెలవు ప్ర‌క‌టించింది. విద్యార్థుల నుంచి పెద్దఎత్తున వచ్చిన విజ్ఞప్తులతో పాటు ప్రతిపక్షాల సూచనలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్లు స‌మాచారం. సీఎం వీడీ సతీశన్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు ప్రొఫెషనల్‌ కాలేజీలకు కూడా సెలవు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

అయితే, ఇప్పటికే నిర్ణయించిన పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫిఫా ఫైనల్‌ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి తర్వాత ముగియనుండటంతో విద్యార్థులు మరుసటి రోజు ఉదయం తరగతులకు హాజరుకావడం ఇబ్బందికరంగా మారుతుందని ఇటీవల మాజీ విద్యాశాఖ మంత్రి శివన్‌కుట్టి అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తులు రావడంతో సెలవు ప్రకటించే నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈసారి ప్రపంచకప్‌ తుది సమరంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా, స్పెయిన్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఫుట్‌బాల్‌ను పండుగలా జరుపుకునే కేరళలో ఫైనల్‌ సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Advertisement