త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Janasena Ministers | ఏపీ కేబినెట్ భేటీ.. ముగ్గురు జ‌న‌సేన మంత్రులు డుమ్మా..!

Janasena Ministers | స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో రిజ్వేష‌న్ల( Local Body Reservations ) ఖ‌రారు సంబంధించి ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కేబినెట్( AP Cabinet ) భేటీకి ముగ్గురు జ‌న‌సేన మంత్రులు( Janasena Ministers ) హాజ‌రు కాలేదు. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌( Pawan Kalyan )తో పాటు మంత్రులు నాదెండ్ల మ‌నోహ‌ర్( Nadendla Manohar ), కందుల దుర్గేశ్( Kandula Durgesh ) గైర్హాజ‌ర‌య్యారు.

S

National | Published On Oct 10, 2026, 3.44 pm IST

Janasena Ministers | ఏపీ కేబినెట్ భేటీ.. ముగ్గురు జ‌న‌సేన మంత్రులు డుమ్మా..!
Advertisement

Janasena Ministers | త్రినేత్ర న్యూస్ : స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో రిజ్వేష‌న్ల( Local Body Reservations ) ఖ‌రారు సంబంధించి ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కేబినెట్( AP Cabinet ) భేటీకి ముగ్గురు జ‌న‌సేన మంత్రులు( Janasena Ministers ) హాజ‌రు కాలేదు. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌( Pawan Kalyan )తో పాటు మంత్రులు నాదెండ్ల మ‌నోహ‌ర్( Nadendla Manohar ), కందుల దుర్గేశ్( Kandula Durgesh ) గైర్హాజ‌ర‌య్యారు.

జనసేన మంత్రుల గైర్హాజరు ఏపీ రాజ‌కీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల అంశం కీలకంగా మారిన నేపథ్యంలో ఈ సమావేశానికి రాజకీయంగా అత్యంత‌ ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, ఇలాంటి ముఖ్యమైన సమావేశానికి కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి చెందిన మంత్రులు ఒకేసారి గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. కేబినెట్ భేటీకి హాజ‌రు కాక‌పోవ‌డం వెనుకాల వ్యక్తిగత, అధికారిక కారణాలే ఉన్నాయా? లేక కూటమిలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఏవైనా విభేదాలు ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ హైదరాబాద్‌లో ఉండగా, మరో మంత్రి కందుల దుర్గేశ్ స్పెయిన్ పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరు గైర్హాజరు కావడానికి సంబంధించి పూర్తి వివరాలు, అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది.

Advertisement
Advertisement