త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | ప్ర‌ధాని మోదీ రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై ట్రంప్ వ్యాఖ్య‌లు.. భార‌త్ ఏమ‌న్న‌దంటే..?

PM Modi | భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై (Modis political future) అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్య‌ల‌పై భార‌త్ స్పందించింది.

D

National | Published On Feb 13, 2026, 1.47 pm IST

PM Modi | ప్ర‌ధాని మోదీ రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై ట్రంప్ వ్యాఖ్య‌లు.. భార‌త్ ఏమ‌న్న‌దంటే..?
Advertisement

PM Modi | భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) పొలిటిక‌ల్ కెరీర్‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గ‌తంలో చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చాయి. గ‌తంలో ఎఫ్‌బీఐ (FBI) డైరెక్టర్‌తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. "భారత ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ భవిష్యత్తు నాశనం చేయాలనుకోవడం లేదు" అంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై కేంద్ర విదేశాంగ శాఖ తాజాగా స్పందించింది.

ట్రంప్ వీడియోపై మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ (Randhir Jaiswal) స‌మాధాన‌మిచ్చారు. తాను ఆ వీడియోను ఇంకా చూడలేదని పేర్కొన్నారు. "నేను ఆ వీడియోను చూడలేదు. ఒకవేళ నిజంగానే అలాంటి వీడియో ఉంటే.. అది నిజమా కాదా అనే విషయాన్ని బట్టి మేము తగిన చర్యలు తీసుకుంటాము" అని ఆయ‌న తెలిపారు.

ట్రంప్ ఏమ‌న్నారంటే..?

గ‌తంలో ట్రంప్ మాట్లాడుతూ.. భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఓ గొప్ప నాయ‌కుడు అంటూ కొనియాడారు. అదే సమయంలో మోదీ రాజకీయ జీవితంపై ట్రంప్ కీల‌క‌ వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజకీయ జీవితాన్ని దెబ్బతీయాలని అనుకోవడం లేదు అంటూ వ్యాఖ్యానించారు. తాను భార‌త్‌ను ఏళ్ల త‌ర‌బ‌డి గ‌మ‌నిస్తున్నాన‌ని.. నా స్నేహితుడు అక్క‌డ చాలా కాలంగా ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చారు. అప్ప‌ట్లో ఈ వీడియో రాజ‌కీయ దుమారం రేగింది. ఇప్పుడు ప్ర‌స్తుతం ఆ వీడియో మ‌రోసారి తెర‌పైకి రావ‌డంతో భార‌త్ స్పందించింది.

Advertisement
Advertisement