త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Reels | రీల్స్ కోసం క‌దులుతున్న వాహ‌నాల డోర్లు తీస్తూ..

Reels | వెర్రి వేయి విధాలు అంటారు. సోషల్ మీడియా పాపుల‌ర్ కావాల‌నే త‌ప‌న‌తో యువ‌త పిచ్చిప‌నులు చేస్తూ తామే కాదు, ఇత‌రుల‌ను ప్ర‌మాదాల బారిన ప‌డేస్తున్నారు. రీల్స్ (Reels) మాయ‌లో ప‌డిన ఓ యువ‌కుడు క‌దులుతున్న వాహ‌నాల (Moving Vehicles) డోర్లు తీస్తూ (Opening Doors) వీడియోలు తీసి, వాటిని సామాజిక మాధ్య‌మాల్లో పోస్టు చేస్తున్నాడు.

G

National | Published On Feb 18, 2026, 11.51 am IST

Reels | రీల్స్ కోసం క‌దులుతున్న వాహ‌నాల డోర్లు తీస్తూ..
Advertisement

Reels | త్రినేత్ర‌.న్యూస్‌: వెర్రి వేయి విధాలు అంటారు. సోషల్ మీడియా పాపుల‌ర్ కావాల‌నే త‌ప‌న‌తో యువ‌త పిచ్చిప‌నులు చేస్తూ తామే కాదు, ఇత‌రుల‌ను ప్ర‌మాదాల బారిన ప‌డేస్తున్నారు. రీల్స్ (Reels) మాయ‌లో ప‌డిన ఓ యువ‌కుడు క‌దులుతున్న వాహ‌నాల (Moving Vehicles) డోర్లు తీస్తూ (Opening Doors) వీడియోలు తీసి, వాటిని సామాజిక మాధ్య‌మాల్లో పోస్టు చేస్తున్నాడు. చివ‌రికి పోలీసుల అరెస్టు చేయ‌డంతో జైలుపాల‌య్యాడు.

ఢిల్లీకి (delhi) చెందిన 22 ఏండ్ల తుషార్ పునియా.. త‌న బైక్‌పై వెళ్తూ క‌దులుతున్న వాహ‌నాల డోర్లు తీస్తూ రీల్స్ చేస్తున్నాడు. ఇలా ఆటోలు, ఆర్టీసీ బ‌స్సుల డోర్లు తీస్తున్న, ఆర్టీసీ బ‌స్సుల‌కు ఎదురుగా వెళ్లి బైక్‌ను ఆప‌డం వంటి ప‌నులు త‌ర‌చూ చేస్తున్నాడు. వాటిని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు. అవికాస్తా పోలీసుల దృష్టికి వెళ్ల‌డంతో నిందితుడిని అరెస్టు చేశారు. అతనిపై ర్యాష్ డ్రైవింగ్ (బీఎన్ఎస్ 281), ఇత‌రుల భ‌ద్ర‌త‌కు హాని క‌లిగించ‌డం (బీఎన్ఎస్ 125) వంటి సెక్ష‌న్లకింద కేసు న‌మోదుచేశారు.

మ‌రో ఘ‌ట‌న‌లో హెల్‌మెంట్ పెట్టుకోకుండా బైక్‌పై స్టంట్లు చేస్తున్న యువ‌కుడిని అదుపులోకి తీసుకున్నారు. భార‌త్‌-పాక్ మ్యాచ్ సంద‌ర్భంగా గ‌త ఆదివారం రాత్రి 11.30 గంట‌ల‌కు సెంట్ర‌ల్‌ ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర న‌గ‌ర్‌ వీధుల్లో స్టంట్లు చేసిన వ్య‌క్తిని అరెస్టు చేశారు.

https://x.com/DelhiPolice/status/2023725108620390470

 

 

Advertisement
Advertisement