Cancer Drugs | క్యాన్సర్ మందులపై ధరల భారం తగ్గింపు.. రోగులకు భారీ ఊరట..!
Cancer Drugs | క్యాన్సర్ రోగులకు ఖరీదైన మందుల భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్-షెడ్యూల్డ్ యాంటీ క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్‌ను గరిష్టంగా 30 శాతానికి పరిమితం చేసింది. ఈ నిబంధన బ్రాండెడ్, జెనరిక్, దేశీయ, దిగుమతి, పేటెంట్ ఉన్న, లేని మందులన్నింటికీ వర్తించనుంది.
Cancer Drugs | క్యాన్సర్ రోగులకు ఖరీదైన మందుల భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్-షెడ్యూల్డ్ యాంటీ క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్‌ను గరిష్టంగా 30 శాతానికి పరిమితం చేసింది. ఈ నిబంధన బ్రాండెడ్, జెనరిక్, దేశీయ, దిగుమతి, పేటెంట్ ఉన్న, లేని మందులన్నింటికీ వర్తించనుంది. అధిక ట్రేడ్ మార్జిన్ల కారణంగా పెరుగుతున్న ఔషధ ధరలను నియంత్రించడం, లైఫ్ సేవింగ్ క్యాన్సర్ మందులను రోగులకు అందుబాటులోకి తేవడమే నిర్ణయం లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. కొన్ని మందుల గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పీ) ఏకంగా 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.
ధరల తగ్గింపుతో క్యాన్సర్ చికిత్సలో రోగులపై పడే సొంత ఖర్చు తగ్గనుంది. ఈ నిర్ణయం ద్వారా రోగులకు ఏటా సుమారు రూ.2,500 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. 2019లో 526 బ్రాండ్ల క్యాన్సర్ మందులపై తీసుకున్న చర్యలతో ఏటా సుమారు రూ.984 కోట్ల మేర రోగులకు ప్రయోజనం కలిగిందని ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ మందులపై మార్జిన్ పరిమితితో మరింత ఉపశమనం కల్పించే ప్రయత్నం చేస్తోంది. ధరలను తగ్గించడంతోపాటు మార్కెట్‌లో ప్రాణరక్షక మందుల కొరత లేకుండా చూడటంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందుబాటు ధరల్లో క్యాన్సర్ చికిత్స అందించడంతోపాటు అవసరమైన మందులు నిరంతరం లభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...
- ●K Kavitha | చిత్రపురి అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి : కల్వకుంట్ల కవిత

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!

OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ





