BJP TVK Alliance | 80 సీట్లు.. ఉప ముఖ్యమంత్రి పదవి.. విజయ్‌కి బీజేపీ ఆఫర్!
BJP TVK Alliance | తమిళనాడులో (Tamil Nadu) సరికొత్త పొత్తులకు తెర లేవనుందా?. అధికార డీఎంకేకు ఈ సారి ఓటమి తప్పదా?. రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ ఈ ఎన్నికల్లో కింగ్‌పిన్‌గా మారనున్నాడా?. అంటే అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. అందుకే ఆ పార్టీ విజయ్ (Vijay) తమిళగ వెట్రి కజగంతో (TVK) జట్టుకట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.
BJP TVK Alliance | త్రినేత్ర.న్యూస్: తమిళనాడులో (Tamil Nadu) సరికొత్త పొత్తులకు తెర లేవనుందా?. అధికార డీఎంకేకు ఈ సారి ఓటమి తప్పదా?. రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ ఈ ఎన్నికల్లో కింగ్‌పిన్‌గా మారనున్నాడా?. అంటే అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. అందుకే ఆ పార్టీ విజయ్ (Vijay) తమిళగ వెట్రి కజగంతో (TVK) జట్టుకట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. గెలుపోటముల మధ్య తేడా స్వల్ప ఓటు శాతమే ఉంటుందని భావిస్తున్న కాషాయ పార్టీ.. విజయ్ అభిమాన బలంతో ఈ రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య పొత్తుపై చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తున్నది.
టీవీకేకు 80 స్థానాలు, విజయ్‌కి ఉప ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ ఈ చర్చలు విజయవంతమై, పొత్తు కార్యరూపం దాలిస్తే రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి. అయితే టీవీకే వర్గాలు మాత్రం విజయ్ ముఖ్యమంత్రి పదవిపైనే దృష్టి సారించినట్లు వెల్లడించాయి. ఈ అంశంపైనే ఇరు వర్గాల మధ్య ప్రతిష్టంభనకు దారితీసినట్లు తెలుస్తున్నది. అయినప్పటికీ ఎలాగైనా బీజేపీ గొడుకు కిందకి విజయన్ తీసుకురావాలనుకుంటున్న ఆ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.
కాగా, తాము బీజేపీతో చేతులు కలిపే అవకాశం లేదని ఇప్పటికే ప్రకటించిన విజయ్.. మళ్లీ ఆ పార్టీతో కలిసి నడువనున్నట్లు ప్రచారం జరుగుతుండటం గమనార్హం. కరూర్ తొక్కిసలాట ఘటనలో ఢిల్లీలో సీబీఐ విచారణకు విజయ్ హాజరుకానున్న నేపథ్యంలో పొత్తుకు సంబంధించి లీకులు రావడం రాయకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



