Aviva Baig | ప్రియాంక గాంధీ కొడుకుని పెళ్లి చేసుకుంటున్న యువతి ఎవరో తెలుసా?
ఢిల్లీకి చెందిన ఫోటోగ్రాఫర్ ఈమె. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి జర్నలిజం , కమ్యూనికేషన్ డిగ్రీ చదివింది. ఢిల్లీలోని మోడర్న్ స్కూల్‌లో తన పాఠశాల చదువును పూర్తి చేసింది. అటెలియర్ 11 (Atelier 11) అనే ఫోటోగ్రఫిక్ స్టూడియోను అవివా ప్రారంభించింది.
Aviva Baig | రైహాన్ వాద్రా.. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ కొడుకు. ఇప్పుడు ఇతడి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే. తన కొడుక్కి పెళ్లి సంబంధం చూసి త్వరలోనే పెళ్లి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట ప్రియాంకా గాంధీ. ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా తన భర్త అని తెలుసు కదా. ఇద్దరు కలిసి రైహాన్‌కి మంచి సంబంధం చూశారట. ఆ యువతి పేరు అవివా బైగ్ అని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఇద్దరూ కలిసి తిరిగిన ఫోటోలు వైరల్ అవుతుండటంతో త్వరలోనే వీళ్ల పెళ్లి జరిగే చాన్స్ ఉందని తెలుస్తోంది.

గత 7 సంవత్సరాలుగా వీళ్లిద్దరికీ పరిచయం ఉన్నట్లు సమాచారం. అవివాది ఢిల్లీ. అవివా ఫ్యామిలీ, ప్రియాంకా ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. అందుకే రైహాన్‌కి అవివాను ఇచ్చి వివాహం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం రైహాన్‌తో క్లోజ్‌గా ఉన్న ఫోటోను అవివా పెట్టడంతో ఇద్దరికీ పెళ్లి ఫిక్స్ అయినట్లుగా సోషల్ మీడియాలో జోరుగా వార్తలు ఊపందుకున్నాయి.

అసలు ఎవరీ అవివా బైగ్?
ఢిల్లీకి చెందిన ఫోటోగ్రాఫర్ ఈమె. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి జర్నలిజం , కమ్యూనికేషన్ డిగ్రీ చదివింది. ఢిల్లీలోని మోడర్న్ స్కూల్‌లో తన పాఠశాల చదువును పూర్తి చేసింది. అటెలియర్ 11 (Atelier 11) అనే ఫోటోగ్రఫిక్ స్టూడియోను అవివా ప్రారంభించింది. అలాగే తనకు ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది. పలు ఏజెన్సీలు, బ్రాండ్స్, క్లయింట్స్‌తో పని చేస్తుంటుంది. తను తీసిన పలు ఫోటోలను ఎగ్జిబిషన్‌లోనూ ప్రదర్శనకు ఉంచుతుంది. ప్లస్ రైమ్న్ (PlusRymn) అనే కంపెనీకి ఫ్రీలాన్స్ ప్రొడ్యూసర్‌గానూ అవివా పనిచేస్తుంది. ఇలా ఫ్రీలాన్సర్‌గా పలు కంపెనీలలో పని చేస్తున్న అవివా పలు మ్యాగజైన్లలోనూ ఎడిటర్‌గా పని చేస్తోంది. తనకు కాబోయే భర్త రైహాన్ కూడా ఫోటోగ్రాఫరే.
View this post on Instagram
View this post on Instagram
సంబంధిత వార్తలు

Priyanka Gandhi | మోదీ ప్రభుత్వానికి చీకటి రోజు.. ఈ ఫలితం విపక్షాల ఐక్యతకు నిదర్శనం.. రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడంపై ప్రియాంక గాంధీ
ఏప్రిల్ 18, 2026

Revanth Reddy | డీలిమిటేషన్‌పై ప్రత్యామ్నాయ సూచనలు భేష్.. సీఎం రేవంత్‌ను అభినంధించిన ప్రియాంక
ఏప్రిల్ 18, 2026

Om Birla No Confidence Motion | దద్దరిల్లిన లోక్‌సభ.. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం
మార్చి 10, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



