త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BC Reservations | ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు.. బీసీ రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు

BC Reservations | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు( Local Body Elections ) సంబంధించి బీసీ రిజ‌ర్వేష‌న్లు( BC Reservations ) ఖ‌రారు అయ్యాయి. సీఎం చంద్ర‌బాబు( CM Chandrababu ) అధ్య‌క్ష‌త‌న శ‌నివారం జ‌రిగిన ప్ర‌త్యేక కేబినెట్ స‌మావేశంలో బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను ఫైన‌ల్ చేశారు. రాజీవ్ రంజ‌న్ క‌మిష‌న్( Rajeev Ranjan Commission ) ఇచ్చిన నివేదిక ఆధారంగా రిజ‌ర్వేష‌న్ల‌ను ఖరారు చేశారు.

S

National | Published On Oct 10, 2026, 3.57 pm IST

BC Reservations | ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు.. బీసీ రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు
Advertisement

BC Reservations | త్రినేత్ న్యూస్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు( Local Body Elections ) సంబంధించి బీసీ రిజ‌ర్వేష‌న్లు( BC Reservations ) ఖ‌రారు అయ్యాయి. సీఎం చంద్ర‌బాబు( CM Chandrababu ) అధ్య‌క్ష‌త‌న శ‌నివారం జ‌రిగిన ప్ర‌త్యేక కేబినెట్ స‌మావేశంలో బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను ఫైన‌ల్ చేశారు. రాజీవ్ రంజ‌న్ క‌మిష‌న్( Rajeev Ranjan Commission ) ఇచ్చిన నివేదిక ఆధారంగా రిజ‌ర్వేష‌న్ల‌ను ఖరారు చేశారు.

కేబినెట్ భేటీ ముగిసిన అనంత‌రం మంత్రులు మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్‌, సర్పంచ్‌, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ ఛైర్‌పర్సన్‌, మున్సిపల్‌ వార్డు మెంబర్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌, మేయర్‌తో సహా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు ఖరారు చేసిన‌ట్లు పేర్కొన్నారు. పంచాయతీ వార్డు మెంబర్స్‌లో బీసీలకు 26.73 శాతం రిజర్వేషన్లు, సర్పంచ్‌లలో 27.95 శాతం, ఎంపీటీసీలకు 25.55, ఎంపీపీల్లో 24.60, జడ్పీటీసీలకు 24.60 శాతం, జడ్పీ ఛైర్‌పర్సన్లకు 23.08 శాతం, అర్బన్‌ వార్డుమెంబర్లకు 32.78 శాతం మేర బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేలా నిర్ణయించారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లలో 32.03 శాతం, మేయర్లలో 35.02 శాతం మేర రిజర్వేషన్లు ఖరారు చేసిన‌ట్లు మంత్రులు తెలిపారు.

Advertisement
Advertisement