త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AP News | ఆ వ్య‌క్తితో నా భ‌ర్త స‌న్నిహితంగా.. అది కూడా మా ప‌డ‌క‌గ‌దిలో

AP News | ఇదో విచిత్ర‌మైన కేసు. ఓ వ్య‌క్తితో నా భ‌ర్త స‌న్నిహితంగా ఉండ‌డం చూశాన‌ని ఓ వివాహిత పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అదేదో ఎక్క‌డో కాదు.. ఏకంగా త‌మ ప‌డ‌క గ‌దిలోనే మ‌రో మ‌గాడితో త‌న భ‌ర్త స‌న్నిహితంగా ఉన్న‌ట్టు ఆమె పేర్కొంది.

S

National | Published On Feb 21, 2026, 4.26 pm IST

AP News | ఆ వ్య‌క్తితో నా భ‌ర్త స‌న్నిహితంగా.. అది కూడా మా ప‌డ‌క‌గ‌దిలో
Advertisement

AP News | త్రినేత్ర‌.న్యూస్ : ఇదో విచిత్ర‌మైన కేసు. ఓ వ్య‌క్తితో నా భ‌ర్త స‌న్నిహితంగా ఉండ‌డం చూశాన‌ని ఓ వివాహిత పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అదేదో ఎక్క‌డో కాదు.. ఏకంగా త‌మ ప‌డ‌క గ‌దిలోనే మ‌రో మ‌గాడితో త‌న భ‌ర్త స‌న్నిహితంగా ఉన్న‌ట్టు ఆమె పేర్కొంది. ఈ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ శ్రీస‌త్య‌సాయి జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రంలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ధ‌ర్మ‌వ‌రం ప్రాంతానికి చెందిన తుల‌సి అనే మ‌హిళ‌తో రాంన‌గ‌ర్ వాసి దాశ‌ర‌థితో 14 ఏళ్ల క్రితం పెళ్లైంది. ఇన్నాళ్లు వీరి సంసార జీవితం స‌వ్యంగానే సాగిన‌ప్ప‌టికీ.. గ‌త కొంత‌కాలం నుంచి దాశ‌ర‌థి స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునేలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. త‌న స్నేహితుడు మ‌న్సూరుద్దీన్‌తో స‌న్నిహితంగా ఉంటున్నాడు. దాశ‌ర‌థి వ్య‌వ‌హార‌శైలి న‌చ్చ‌క భార్య తుల‌సి స‌త్య‌సాయి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ఈ సంద‌ర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. రాంన‌గ‌ర్‌కు చెందిన దాశ‌ర‌థితో నాకు పెళ్లై 13 ఏళ్లు అవుతుంది. గ‌త కొంత‌కాలంగా దాశ‌ర‌థి త‌న స్నేహితుడు మ‌న్సూరుద్దీన్‌తో స‌న్నిహితంగా ఉంటున్నాడు. స్నేహితులైన వారిద్ద‌రూ 'గే'స్‌గా మారి నాకు అన్యాయం చేస్తున్నారు. నేను ఇవ‌న్నీ బ‌య‌ట‌పెడుతున్నాన‌ని చెప్పి.. నా ప్రాణం తీయాల‌ని చూస్తున్నారు. నాకు న్యాయంతో పాటు ర‌క్ష‌ణ క‌ల్పించాలి అని ఆమె ఎస్పీని వేడుకున్నారు.

Advertisement
Advertisement