త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AIIMS Study | రక్తాన్ని పలుచగా చేసే మందుల ప్రభావం తగ్గుతోందా? ప్రతి ముగ్గురిలో ఒకరిలో ప్రమాదకర సంకేతాలు..!

AIIMS Study | గుండెజబ్బుల చికిత్సలో కీలకంగా ఉపయోగించే ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ వంటి రక్తాన్ని పలుచగా చేసే మందుల ప్రభావంపై ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు అత్యంత ప్రభావవంతంగా ఉన్నాయనుకున్న ఈ మందులు ప్రతి ముగ్గురిలో ఒకరిలో సరిగా పని చేయడం లేదని తాజా అధ్యయనంలో తెలిసింది.

P

Lifestyle | Published On Mar 23, 2026, 10.10 am IST

AIIMS Study | రక్తాన్ని పలుచగా చేసే మందుల ప్రభావం తగ్గుతోందా? ప్రతి ముగ్గురిలో ఒకరిలో ప్రమాదకర సంకేతాలు..!
Advertisement

AIIMS Study | గుండెజబ్బుల చికిత్సలో కీలకంగా ఉపయోగించే ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ వంటి రక్తాన్ని పలుచగా చేసే మందుల ప్రభావంపై ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు అత్యంత ప్రభావవంతంగా ఉన్నాయనుకున్న ఈ మందులు ప్రతి ముగ్గురిలో ఒకరిలో సరిగా పని చేయడం లేదని తాజా అధ్యయనంలో తెలిసింది. పూర్తిగా లేదంటే కొంతమేర పనిచేయకపోవచ్చని ఎయిమ్స్‌ అధ్యయనం పేర్కొంది. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యులు నిర్వహించిన ఈ పరిశోధనలో గుండె, రక్తనాళాల వ్యాధులతో బాధపడుతున్న 151 మంది రోగులను పరిశీలించారు. ఈ అధ్యయనంలో ఆస్పిరిన్ సుమారు 30 శాతం మందిలో ప్రభావం చూపకపోగా, క్లోపిడోగ్రెల్ ప్రభావం మరింత తక్కువగా ఉందని తేలింది.

మందులు రక్తం గడ్డకట్టడాన్ని ఎంతవరకు అడ్డుకుంటున్నాయో తెలుసుకోవడానికి ప్లేట్లెట్ అగ్రిగేషన్ టెస్టులు చేశారు. ముఖ్యంగా మధుమేహం ఉన్న రోగుల్లో ఈ మందులు ఆశించిన మేరకు పనిచేయకపోవడం పరిశోధకులను ఆందోళనకు గురిచేసింది. మందులు సరిగా పనిచేయకపోతే గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పరిశోధన సమయంలో కొందరు రోగులకు మళ్లీ గుండెపోటు రావడం, మరణాలు చోటుచేసుకోవడం గుర్తించారు. అయితే, ఈ ఘటనలకు మందుల ప్రభావం తగ్గడమే ప్రత్యక్ష కారణమా? అనే అంశంపై ఇంకా స్పష్టత అవసరమని చెప్పారు. ఎయిమ్స్‌ కార్డియాలజీ విభాగానికి చెందిన డాక్టర్ నిర్మల్ ఘాటి మాట్లాడుతూ అందరికీ ఒకే విధంగా చికిత్స ఇవ్వడం సరైన పద్ధతి కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రోగి పరిస్థితి, మందులకు వారి శరీరం ఎలా స్పందిస్తుందనే అంశాల ఆధారంగా చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement