Nalin Haley | చీప్ ప్రభుత్వం.. భారత్‌ను ఉద్దేశించి నిక్కీ హేలి కుమారుడు సంచలన వ్యాఖ్యలు
Nalin Haley | భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ (Nikki Haley) కుమారుడు నలిన్ హేలీ (Nalin Haley) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై, భారత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
International | Published On Feb 2, 2026, 3.14 pm IST
Nalin Haley | భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ (Nikki Haley) కుమారుడు నలిన్ హేలీ (Nalin Haley) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై, భారత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. భారత ప్రభుత్వం ‘చీప్ గరవ్నమెంట్’ అంటూ షాకింగ్ ట్వీట్ చేశారు.
తనను తాను మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ప్రతినిధిగా చెప్పుకునే నలిన్.. అమెరికాకు భారత్ మంచి మిత్రదేశం కాదని వ్యాఖ్యానించారు. ‘అమెరికాకు భారత్ మంచి మిత్ర దేశం కాదు. వాళ్లు (భారత్‌ను ఉద్దేశించి) ఇరాన్ నుంచి తక్కువ ధరకు చమురు, రష్యా నుంచి చౌకగా ఆయుధాలు కొనుగోలు చేశారు. అమెరికాకు మాత్రం చీప్ లేబర్‌ను పంపుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నది చీప్ ప్రభుత్వం’ అంటూ వ్యాఖ్యానించారు.
ఈ సమస్య కేవలం భారత దేశానికి సంబంధించినదే కాదని, అమెరికా ఇతర మిత్రదేశాలతో ఉన్న సంబంధాలను కూడా పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది అని నలిన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు భారత సంతతికి చెందిన పొలిటికల్ లీడర్, గత ఎన్నికల్లో ట్రంప్‌తోపాటూ అధ్యక్ష పదవికి పోటీ పడిన వివేక్ రామస్వామికి సంబంధించిన ఓ వీడియోను కోట్ చేస్తూ నలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోలో రామస్వామి.. చైనా నుంచి అమెరికా వైదొలిగి.. భారత్‌తో సన్నిహిత సంబంధాలను కొనసాగించాలని చెప్పుకొచ్చారు. ఇక నలిన్ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై భారతీయులు, భారత సంతతికి చెందిన అమెరికన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
https://x.com/Nalin_Haley/status/2017281472177074583?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2017281472177074583%7Ctwgr%5E99451cb014d0b17a4bc7d2757c30e4fedef08d50%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Fworld-news%2Fcheap-government-indian-origin-nikki-haleys-son-nalins-anti-india-rant-10930537
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






