Alireza Arafi | ఇరాన్ సుప్రీం లీడర్‌గా అలిరెజా..! ఎవరీ అరాఫీ..?
Alireza Arafi | పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. సుదీర్ఘకాలం సుప్రీం లీడర్‌గా కొనసాగి అయతుల్లా అల్ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
International | Published On Mar 1, 2026, 6.28 pm IST
Alireza Arafi | పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. సుదీర్ఘకాలం సుప్రీం లీడర్‌గా కొనసాగి అయతుల్లా అల్ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాంతో తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీని నియమించారు. ఈ విషయాన్ని ఆ దేశ వార్తా సంస్థ ఆదివారం ప్రకటించింది. ప్రస్తుతం ఆయన గార్డియన్ కౌన్సిల్ జ్యూరీ సభ్యుడిగా ఉన్నారు. తాత్కాలిక లీడర్‌షిప్ కౌన్సిల్‌కు ఆయన జ్యూరీ సభ్యుడిగా నియమించారు. ఆయన ఖమేనీ స్థానంలో కొత్త వారసుడి నియామకం జరిగే వరకు అరాఫీ సుప్రీం లీడర్‌గా సేవలందిస్తారు.
ముగిసిన ఖమేనీ శకం..
అయతుల్లా ఖమేనీ 1989లో విప్లవ నేత అయతుల్లా ఖొమేనీ మరణం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ నియామకమయ్యారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడి కంటే సుప్రీం లీడర్‌కే అధికారాలు ఎక్కువగా ఉంటాయి. ఖమేనీ దాదాపు 35 ఏళ్ల పాటు ఇరాన్‌ను తిరుగులేని నేతగా పాలించారు. మధ్యప్రాచ్యంలో లెబనాన్, యెమెన్, సిరియా వంటి దేశాల్లో సాయుధ బృందాలకు మద్దతు ఇస్తూ ఇరాన్ ప్రభావాన్ని పెంచారు. దేశం లోపల కఠినమైన ఇస్లామిక్ చట్టాలను అమలు చేయడంలో వెనుకాడలేదు. ఆర్థిక ఆంక్షలు, హిజాబ్ వ్యతిరేక నిరసనలను ఎదుర్కొన్నారు. తాజాగా ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఖమేనీ శకం ముగిసినట్లయ్యింది.
అలీరెజా ఎవరు?
అయతొల్లా అలిరెజా అరఫీ ఇరాన్‌లో అత్యంత సీనియర్ నాయకుడు. ఆయనను తాత్కాలిక నాయకత్వ మండలిలో జ్యూరీ సభ్యుడిగా నియమించారు. ఈ మండలి ప్రస్తుతం సుప్రీమ్ లీడర్ బాధ్యతలను చేపడుతుంది. ఆయన బాధ్యత ప్రభుత్వంలో స్థిరత్వాన్ని కల్పించడం, కొత్త సుప్రీమ్ లీడర్ ఎన్నికయ్యే వరకు దేశానికి నాయకత్వం వహించడం. అలీరెజా ఇరాన్‌లోని యాజ్డ్ ప్రావిన్స్‌లోని మెయిబోడ్‌లో 1959లో జన్మించారు. ఖమేనీ తరహాలోనే సీనియర్ ఇస్లామిక్ స్కాలర్‌గా 'అయతుల్లా' అనే బిరుదును పొందారు. గార్డియన్ కౌన్సిల్‌తో పాటు అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ రెండో డిప్యూటీ చైర్మన్‌గా సేవలందించారు. అంతకు ముందు అల్ ముస్తఫా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చైర్మన్‌గా పని చేశారు. అరబిక్, ఆంగ్లంలో మంచి పట్టున్న నేతగా పేరుంది. ఇరాన్ ఏఐని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఆయనకు గణితం, తత్వశాస్త్రాల్లోనూ పట్టుంది. ఇరాన్‌లో 1979 ఇస్లామిక్ విప్లవం మూలాలు ఉన్న నేతగా పేర్కొంటారు. ఆయన తండ్రి మహమ్మద్ ఇబ్రహీం అల్ ఇరాఫీని ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ రుహొల్లా ఖొమేనీ సన్నిహితుడగా చెబుతారు.
మండలి ఎలా పని చేస్తుంది?
ఇరాన్ రాజ్యాంగం ప్రకారం.. సుప్రీం లీడర్ చనిపోతే.. తర్వాత తాత్కాలిక మండలి ఏర్పడుతుంది. ఈ మండలిలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఉంటారు. చీఫ్ జస్టిస్ ఘులామ్-హుస్సైన్ మొహ్సాని ఏజై కూడా సభ్యుడిగా ఉన్నారు. గార్డియన్ కౌన్సిల్‌లోని ఒక సీనియర్ మత నాయకుడు కూడా మండలిలో ఉంటారు. ఈ సంయుక్త నాయకత్వం దేశానికి సంబంధించిన పరిపాలనా, భద్రతాకు సంబంధించిన తీసుకుంటుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






