ORR | ఔటర్‌రింగ్ రోడ్డుపై రెండు జంటల బైక్ స్టంట్స్.. వీడియో
ORR | ఔటర్‌రింగ్ రోడ్డు (ORR)పై కార్లు, భారీ వాహనాలకు అనుమతి ఉంటుంది. బైకులకు నోఎంట్రీ. కానీ రెండు బైకులు ఓఆర్ఆర్‌పై హల్‌చల్ చేశాయి.
ORR | త్రినేత్ర.న్యూస్: ఔటర్‌రింగ్ రోడ్డు (ORR)పై కార్లు, భారీ వాహనాలకు అనుమతి ఉంటుంది. బైకులకు నోఎంట్రీ. కానీ రెండు బైకులు ఓఆర్ఆర్‌పై హల్‌చల్ చేశాయి. ఇద్దరు యువకులు అమ్మాయిలతో బైకులపై దూసుకెళ్లారు. సోమవారం రాత్రి ద్విచక్ర వాహనాలపై రెండు జంటలు నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పోలీస్ అకాడమీ వైపు నుంచి పుప్పాలగూడ (నానక్‌రాంగూడ) టోల్‌గేట్ వైపు వెళ్తుండగా.. అదేసమయంలో కారులో వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. దీంతో అది వైరల్ అయింది.
వాస్తవానికి ఓఆర్‌ఆర్‌పై ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉండదు. అయితే వారు ఎలా వెళ్లారన్నదే ప్రశ్న?. కాగా, ఈ ఘటన ఓఆర్‌ఆర్ నిర్వహణ సంస్థ నిర్వాహకులకు, ట్రాఫిక్, శాంతిభద్రతల పోలీసులకు సవాల్ విసిరింది. ఈ వీడియో చూసినవారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓఆర్ఆర్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. కాగా, అప్రమత్తమైన నార్సింగి పోలీసులు వీడియో ఆధారంగా రెండు వాహనాల నంబర్‌లను గుర్తించి చర్యలకు ఉపక్రమించారు. అక్కడున్న టోల్‌గేట్ సిబ్బంది ఎందుకు ఆపలేదనే విషయంపై ఆరాతీస్తున్నారు. వాహదారులతోపాటు టోల్ గేట్ సిబ్బందిపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
How come they enter the ORR?? Please look into it @CYBTRAFFIC @HYDTP pic.twitter.com/TkVF6ScSrA
— hydroadwarrior (@arun_bathula) April 12, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




